మగధీర టైంలో అనుకున్నది, ఇప్పుడు కుదిరింది.. భార్యతో రొమాంటిక్ ప్లేస్ లో రాజమౌళి

Published : Aug 18, 2023, 03:45 PM IST

జక్కన్న ప్రస్తుతం నార్వే టూర్ లో ఉన్నారు. బాహుబలి 1 చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ నార్వే లోని స్టావెంజర్ నగరంలో జరగబోతోంది. 

PREV
16
మగధీర టైంలో అనుకున్నది, ఇప్పుడు కుదిరింది.. భార్యతో రొమాంటిక్ ప్లేస్ లో రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టింది. తదుపరి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు కి కసరత్తు చేస్తున్నారు. 

26

మహేష్ అభిమానులు మాత్రమే కాదు యావత్ దేశం ఈ చిత్ర అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహుశా ఈ ఏడాది చివరి నుంచి మహేష్, రాజమౌళి చిత్రం మొదలయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా జక్కన్న ప్రస్తుతం నార్వే టూర్ లో ఉన్నారు. బాహుబలి 1 చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ నార్వే లోని స్టావెంజర్ నగరంలో జరగబోతోంది. 

36

దీనికోసం శోభు యార్లగడ్డ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, రాజమౌళి రమా రాజమౌళి దంపతులు నార్వే వెళ్లారు. అక్కడ ఒక అద్భుతమైన ప్రదేశాన్ని జక్కన్న,రమా రాజమౌళి సందర్శించారు. ఎత్తైన పల్పిట్ రాక్ హిల్ ప్రాంతంలో ప్రకృతి అందాలు వీక్షిస్తూ రాజమౌళి, రమా రాజమౌళి టైం స్పెండ్ చేశారు. 

 

46

ఎత్తైన ఆ ప్రాంతంలో కూర్చోవడం చాలా భయంకరంగా అలాగే థ్రిల్లింగ్ గా ఉంటుంది. రాజమౌళి, రమా రాజమౌళి జంటగా కూర్చున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలని రాజమౌళి మగధీర చిత్ర టైం లోనే అనుకున్నారట. మగధీర చిత్రం కోసం లొకేషన్స్ వెతుకుతున్నప్పుడు ఈ రాక్ హిల్ ఫోటోలని చూశారట. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని సందర్శించాలని కొరిక ఉండేదని రాజమౌళి అన్నారు. 

56

ఇప్పుడు బాహుబలి 1 స్క్రీనింగ్ ద్వారా ఆ కోరిక నెరవేరునట్లు జక్కన్న పోస్ట్ చేసారు. రాక్ హిల్ అంచున రాజమౌళి, రమా ధైర్యంగా కూర్చుని ఫోజులు ఇచ్చారు. 

 

66

రాజమౌళి తదుపరి తెరకెక్కించబోయే మహేష్ బాబు చిత్రం అడవుల్లో చేసే సాహసాల నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరో ప్రపంచాన్ని చుట్టి వచ్చే వీరుడిగా కనిపిస్తాడట. 

click me!

Recommended Stories