రాజమౌళి హీరోగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? తండ్రి విజయేంద్రప్రసాద్‌ చేసిన పనికి మొత్తం తలక్రిందులు

Published : Apr 22, 2025, 07:00 AM IST

Rajamouli As Hero:  రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ఇండియన్‌ సినిమాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంటుంది. త్వరలో ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మారుమొగబోతుంది. ప్రస్తుతం ఆయన మహేష్‌ బాబు హీరోగా `ఎస్‌ఎస్‌ఎంబీ 29` పేరుతో మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇది రిలీజ్‌ అయితే ఇండియన్‌ సినిమా లెక్కలు మారిపోతాయని చెప్పొచ్చు.   

PREV
15
రాజమౌళి హీరోగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? తండ్రి విజయేంద్రప్రసాద్‌ చేసిన పనికి మొత్తం తలక్రిందులు
Rajamouli

Rajamouli As Hero: రాజమౌళి చిన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి కెరీర్‌ని ప్రారంభించి తనని తాను నిరూపించుకుని ఇప్పుడు ఇండియా గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తో ఆస్కార్‌ని తీసుకొచ్చి ఇండియా ఆస్కార్‌ కలని సాకారం చేశారు. ఓ రకంగా పాన్‌ ఇండియా సినిమా ట్రెండ్‌కి పునాది వేశారు.

ఇండియన్‌ సినిమా సరిహద్దులు చెరిపేశారు. సినిమా లెక్కలు మార్చేశారు. భారతీయ సినిమాని ప్రపంచ పటంపై ప్రముఖ స్థానంలో నిలిపే ఉద్దేశ్యంతో వెళ్తున్నారు. 

25
ss rajamouli

ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసిందే. రాజమౌళి అడపాదడపా తన సినిమాల్లో కనిపిస్తుంటారు. చిన్న గెస్ట్ రోల్స్ లో తళుక్కున మెరుస్తున్నారు.

కానీ ఆయన హీరోగానే ఓ సినిమా రూపొందింది. తనే లీడ్‌ రోల్‌గా సినిమాని తెరకెక్కించారు. కానీ అది విడుదలకు నోచుకోలేదు. తండ్రి విజయేంద్రప్రసాద్‌ కారణంగానే అది ఆగిపోయింది. మరి ఆ కథేంటో చూస్తే. 

35
Rajamouli

రాజమౌళి హీరోగా నటించింది చిన్నప్పుడు. ఆయన బాలనటుడిగా `పిల్లన గ్రోవి` పేరుతో సినిమా తెరకెక్కింది. దీనికి కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా దర్శకత్వం వహించారు. విజయేంద్రప్రసాద్ నిర్మాత.

ఇందులో రాజమౌళి బాల కృష్ణుడిగా లీడ్‌ రోల్‌ చేశారు. రాజమౌళి సిస్టర్‌ ఎం ఎం శ్రీలేఖ కూడా ఓ పాత్రలో నటించడం విశేషం. వీరితోపాటు జేవీ సోమయాజులు, నిర్మలమ్మ వంటి వారు నటించారు. టెక్నీకల్‌ టీమ్‌ అంతా రాజమౌళి ఫ్యామిలీనే పని చేసింది. కీరవాణి సంగీతం అందించారు. 
 

45
Rajamouli , vijayendra prasad

ఓ బ్రహ్మణ కుటుంబం నేపథ్యంలో ఈ `పిల్లన గ్రోవి` మూవీని తెరకెక్కించారు శివ శక్తి దత్తా. సినిమాని తక్కువ బడ్జెట్‌లో రూపొందించాలనుకున్నారు. కానీ చిత్రీకరణ ప్రారంభించాక అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. అనుకున్న బడ్జెట్ అయిపోయింది. ఖర్చు పెరిగిపోయింది. పెట్టే స్థోమత లేదు.

దీంతో కొంత కాలం సినిమాని ఆపేశారు. ఆ తర్వాత డబ్బు సర్దుబాటు చేసుకుని పూర్తి చేయాలనుకున్నారు. కానీ సెట్‌ కాలేదు. డిలే అయ్యింది. ఈ లోపు రాజమౌళితోపాటు ఇతర చైల్డ్ ఆర్టిస్ట్ లు పెద్దవారయ్యారు. సీనియర్లలో కొందరు కన్నుమూశారు. దీంతో చేసేదేం లేక ఈ మూవీని ఆపేశారు. 
 

55
rajamouli, mahesh babu

అలా రాజమౌళి హీరోగా నటించిన పిల్లల మూవీ మధ్యలోనే ఆగిపోయింది. రాజమౌళిని తండ్రి విజయేంద్రప్రసాద్‌ హీరో కాకుండా చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి డైరెక్షన్‌ వైపు వెళ్లారు రాజమౌళి. రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు. కొన్ని సీరియల్స్ కూడా రూపొందించారు.

ఆ తర్వాత `స్టూడెంట్‌ నెం 1` చిత్రంతో దర్శకుడిగా మారాడు. జూ ఎన్టీఆర్‌ ని హీరోగా పరిచయం చేశారు. ఇక అంతే రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫెయిల్యూర్‌ లేని దర్శకుడిగా ఎదిగారు. అడపాదడపా సినిమాల్లో గెస్ట్ గా మెరుస్తూ తన అలరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమాతో బిజీగా ఉన్నారు జక్కన్న. 

read  more: `పాడుతా తీయగా`లో మరో బాగోతం, గిఫ్ట్స్ ఇస్తే ఫేవర్‌గా జడ్జ్ మెంట్‌.. లేడీ సింగర్ మరో సంచలన ఆరోపణ

also read: 9 సార్లు రీమేక్‌ అయిన త్రిష మూవీ ఏంటో తెలుసా? తెలుగులో అది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories