`రాజ రాజ చోర` యూఎస్‌ ప్రీమియర్‌ షో రివ్యూ..

First Published Aug 19, 2021, 7:36 AM IST

డిఫరెంట్‌, డీసెంట్‌, హ్యూమర్‌ కలిగిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో రాణిస్తున్నారు ఇప్పుడు `రాజరాజచోర` అనే మరో ఎంటర్‌టైనర్ తో ఈ గురువారం(ఆగస్ట్ 19) ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్స్ పడ్డాయి. మరి సినిమా ప్రీమియర్స్ టాక్‌ ఎలా ఉందో చూద్దాం. 
 

కథ విషయానికి వస్తే.. 

భాస్కర్(శ్రీవిష్ణ).. ఓ దొంగ. సంజన(మేఘా ఆకాష్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ముందు తాను కూడా సాఫ్ట్ వేర్‌ ఎంప్లాయ్‌ అనే బిల్డప్‌ కొడుతుంటాడు. అయితే బయటకు దొంగగా కనిపించే భాస్కర్‌లో తెలియని మరో లైఫ్‌ ఉంటుంది. మరోవైపు విలయమ్స్(రవిబాబు) ఓ పోలీస్‌ ఆఫీసర్‌. సంజన అంకుల్‌. అతనికి ఓ సీక్రెట్‌ లైఫ్‌ ఉంటుంది. ఈ రెండు ట్రాక్‌లు ఎలా ఢీ కొన్నాయి. ఈ భాస్కర్‌కి, విలియమ్స్ ఉన్న సంబంధం ఏంటి? అవి సినిమా కథలో ఎలాంటి పరిణామాలకు దారి తీశాయనేది కథ.
 

విశ్లేషణః దర్శకుడు హసిత్‌ గోలికిది తొలి చిత్రం. తనకు హాస్యం కంటే డ్రామా ఎక్కువగా ఇష్టమని తెలిపాడు. ఫస్టాఫ్‌ మొత్తం కామెడీ ట్రాక్‌పై నడిపించి, ద్వితీయార్థం మాత్రం డ్రామాపై నడిపించారు. సెకండాఫ్‌లో కామెడీ తగ్గిపోయింది. `రాజ రాజ చోర` చిత్రంలో సబ్‌ స్టోరి పెద్దగా ఇబ్బంది పెట్టదు. సినిమా మొదట కాస్త స్లోగా సాగినా, ఆ తర్వాత అది ఎంటర్‌టైనింగ్‌గా, ఆడియెన్స్ ని కథలోకి తీసుకెళ్లేలా ఉంది. 

సినిమాలోని ప్రధాన పాత్రల విచిత్రమైన ఒప్పందాలు ఆసక్తిని కలిగిస్తాయి. రవిబాబు రహస్య జీవితం ఇందులో కీలకంగా ఉంటుంది. లా స్టూడెంట్‌ సునైనా. గృహిణిగా ఉంటుంది. డాక్టర్ గా శ్రీకాంత్‌ అయ్యంగారు రియల్‌ ఎస్టేట్‌పై ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ పాత్రల తీరుతెన్నులు విచిత్రంగా ఉన్నా, సమ్‌ థింగ్‌ స్పెషల్‌గా అనిపించి ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. మేఘా ఆకాష్‌ రెగ్యూలర్‌కి భిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. శ్రీవిష్ణు దొంగగా అందరిని మెప్పిస్తుంటాడు. అయితే సినిమా ఫస్టాఫ్‌ నుంచి సెకండాఫ్‌కి వెళ్లే కొద్ది డ్రామా పెరుగుతుంది. హాస్యం తగ్గుతుంది. ఈ విషయంలో ఆడియెన్స్ కాస్త బోర్‌ ఫీలయ్యే అవకాశాలున్నాయి. సెకండాఫ్‌లో రన్‌ టైమ్‌ పరంగా ఫస్టాఫ్‌తో పోల్చితే తక్కువగా ఉంటుంది. ఇది ఆడియెన్స్ కి ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ద్వితీయార్థం డ్రాప్‌ అయినా క్లైమాక్స్, ఎమోషనల్‌ కంటెంట్‌ దాన్ని భర్తీ చేస్తుంది.

నటీనటుల ప్రదర్శన.. 
శ్రీవిష్ణు దొంగగా చాలా కాన్ఫిడెంట్‌గా చేశాడు. గత సినిమాలతో పోల్చితే ఆయన నటన పరంగా బాగా మెప్పించాడని చెప్పొచ్చు. కామెడీ  చాలా నిజాయితీగా చేశాడు. సెకాండాఫ్‌లో హీరోయిన్‌తో లవ్‌ ఎపిసోడ్స్ లో శ్రీవిష్ణు నటన మరింతగా ఆకట్టుకుంటుంది. మేఘా ఆకాష్‌ ఫర్వాలేదనిపించింది. సునైనా కొత్తమ్మాయి. బాగా చేసింది. మంచి భవిష్యత్‌ ఉంది. రవిబాబు నెగటివ్‌ రోల్‌లోనూ తనదైన హ్యూమర్‌ పండించాడు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శ్రీవిష్ణు మధ్య కాంబినేషన్‌ సీన్లు ఆకట్టుకుటున్నాయి. `బిగ్‌బాస్‌` గంగవ్వకి ఇంకాస్త సీన్లు పెంచాల్సి ఉంది.
 

సాంకేతికంగా చూస్తే..

వివేక్‌ సాగర్ ఇప్పటికే నిరూపించుకున్నారు. `సమ్మోహనం`,`పెళ్లిచూపులు`,`బ్రోచేవారెవరురా` చిత్రాలతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మెప్పించారు. ఇందులోనూ ట్రైలర్‌ మేడ్‌గా పాటలు నిలిచాయి. బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుంది. వేదారామన్‌ శంకరన్‌ కెమెరా వర్క్ సింప్లీ సూపర్‌గా చెప్పొచ్చు. ఆర్ట్ వర్క్ ఓకే. విప్లవ్‌ ఎడిటింగ్‌ సినిమాకి ప్లస్‌గా చెప్పొచ్చు.
 

ఫైనల్‌గా చెప్పాలంటే.. `రాజ రాజ చోర` చూడదగిన సినిమా. కామెడీ, సెంటిమెంట్‌, భార్యాభర్తల ఈక్వేషన్స్, పోలీస్‌, క్రిమినల్‌ ఎలిమెంట్స్ ఇలా అన్ని యాంగిల్స్ ఉన్నాయి. జస్ట్ రిలాక్సేషన్‌ మూవీగా చెప్పొచ్చు. ఇది యూఎస్‌ ప్రీమియర్స్ టాక్‌. అసలు రివ్యూ మరి కాసేపట్లో వస్తుంది.
 

click me!