రాజ్ తరణ్ 'ఒరేయ్ బుజ్జిగా' రివ్యూ

First Published | Oct 1, 2020, 10:26 PM IST


రాజ్ తరుణ్ కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ కావాలి. అలాగే  గుండె జారి గల్లంతైందే అంటూ హిట్ కొట్టి, ఒక లైలా కోసం అంటూ కెరీర్ గల్లంతు చేసుకున్న విజయ్ కుమార్ కొండ హిట్ అత్యవసరం. ఇద్దరూ హిట్ కోసం పరితపిస్తున్నవారే. గతంలో ప్రూవ్ చేసుకున్నవాళ్లే. ట్రైలర్ చూస్తే ..పూర్తి ఫన్ తో ఉన్న సినిమా అనిపిస్తోంది. మరి ఇది మరో గుండె జారి గల్లంతు అవుతుందేమో అని ఆశలు రేకిత్తిస్తోంది. దానికి తోడు థియోటర్ లో రిలీజ్ కావాల్సిన సినిమా ఓటీటిలో జారింది. ఇక్కడ గల్లంతు అవకుండా ఒడ్డున పడిందా.. బుజ్జిగాడు భలే ఉన్నాడు అనిపించుకున్నాడా...కావాల్సిన నవ్వులు ఉన్నాయా...హీరో,దర్శకులిద్దరూ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటినిడదవోలులో ఉన్న బుజ్జి (రాజ్ తరుణ్) కు తల్లి తండ్రులు పెళ్లి ఫిక్స్ చేస్తారు.ఆ పెళ్లి ఇష్టం లేని బుజ్జి హైదరాబాద్ ఎవరికి చెప్పాపెట్టకుండా బయిలుదేరతాడు. అక్కడ తన గర్ల్ ప్రెండ్ సుజన (హెబ్బా పటేల్) ని కలుద్దామని అతని ఆలోచన. అదే సమయంలో అదే టౌన్ లో ఉన్న కృష్ణవేణి (మాళవిక నాయిర్) కూడా హైదరాబాద్ జంప్ అవుతోంది. ఆమె ది బుజ్జి గాడి సమస్యే. ఆమె బావతో ఇష్టం లేని పెళ్లి ..అందుకే తప్పించుకోవటానికి హైదరాబాద్ ప్రయాణం పెట్టుకుంది. వీళ్లిద్దరూ ఒకరికి మరొకరు తెలియదు. దాంతో ఇద్దరూ ట్రైన్ లో పరిచయం అవుతారు. అయితే తమ సొంత పేర్లు చెప్పుకోరు. ఇక వీళ్లద్దరు ఒకే సారి మిస్సయ్యారు అనే విషయం తెలుసుకున్న నిడదవోలు వాసులంతా...బుజ్జిగాడు..కృష్ణవేణిని లేపుకుపోయాడురోయ్ అని డిస్కషన్స్ మొదలెట్టేస్తారు.
వాళ్లిద్దరు తమ మారు పేర్లు శ్రీను – స్వాతిగానే ప్రేమలో పడతారు. అయితే ఓ రోజు బుజ్జికు ఓ విషయం తెలుస్తుంది. కృష్ణవేణి తన ఊరు నుంచి వచ్చిన అమ్మాయేనని, తనని ద్వేషిస్తోందని..అందుకో బలమైన కారణం ఉందని. ఆమెకు కూడా బుజ్జి అంటే మరెవరో కాదు తను ద్వేషించే శ్రీను అని తెలుస్తుంది. ఇలా అతని అసలు ఐడింటిటీ తెలియగానే ఏ బావని అయితే పెళ్లి చేసుకోను అని వచ్చేసిందో..అతనికి ఓకే చెప్పేస్తుంది. అప్పుడు బుజ్జి ఏం చేసి ఆమెను కన్వీన్స్ చేసి తన ప్రేమని పండించుకున్నాడు. బుజ్జి గర్ల్ ప్రెండ్...సుజన మ్యాటర్ ఏమైంది, అసలు శ్రీను ని కృష్ణవేణి ఎందుకు ద్వేషిస్తోంది..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందిగతంలో ఓ సారి చూసేసిన సినిమా మళ్లీ చూస్తున్నట్లు అనిపించింది. అందుకు కారణం దర్శకుడు కన్వీనింట్ గా కథ నడపటమే. కథలో ఎక్కడైనా కాంప్లిక్ట్ వస్తోందంటే దాన్ని పడేసి, డ్రామా పిండేసి, చివరకు ఏమీ లేదని తేల్చేదాకా ఊరుకోడు. ఆ మధ్యన అల్లరి నరేష్ హీరోగా వచ్చిన మేడమీద అబ్బాయిలోనూ ఇలాంటి ఇంట్రోనే ఉంటుంది. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ తమ తమ పర్పస్ లు కోసం ట్రైన్ ఎక్కుతారు. ఊరంతా వీళ్లిద్దరూ ప్లాన్ చేసుకుని లేచిపోయారు అనుకుంటారు. అయితే అక్కడ సెకండాఫ్ ... బాగుంటుంది.
ఇక్కడ పరమ రొటీన్,అవుట్ డేటెడ్ సీన్స్,ట్విస్ట్ లు కనిపిస్తాయి. ట్రైలర్ చూసి చక్కగా నవ్వుకోవచ్చు అనుకుంటే అక్కడక్కడా వచ్చే డైలాగులు, రాజ్ తరుణ్ మానరిజం మాత్రమే నవ్విస్తాయి. ఎక్కడకక్కడ కామెడీ చేసేద్దామనే దర్శకుడు తాపత్రయమే స్క్రిప్టుని, సినిమాని ముంచిందనిపిస్తుంది. విడి ఎపిసోడ్స్, డైలాగులుగా బాగానే నవ్విస్తాయి. కానీ అవన్నీ ఒక కథగా చూసినప్పుడు మాత్రం వర్కవుట్ అవలేదు. దర్శకుడు కొండా విజయ్ కుమార్..తన సూపర్ హిట్ చిత్రం గుండె జారి గల్లంతయ్యింది తరహాలో మిస్ కమ్యూనికేషన్ కామెడీని పండిద్దామనుకుని...అలాంటి సీన్స్ నే వర్కవుట్ చేయాలని ప్రయత్నించారు.
ఇంటర్వల్ ముందు కథ కాస్త గాడిలో పడిందనిపిస్తుంది. అయితే సెకండాఫ్ మాత్రం ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. హెబ్బా పటేల్ కు ఎలాంటి పాత్రలు వస్తున్నాయా అనిపిస్తుంది. తిన్నావురా సుజనా అనే వైరల్ వీడియోని బేస్ చేసుకుని ఆ పాత్రను డిజైన్ చేసారు. ఎంత కాలక్షేపానికైనా ,కామెడీ అయినా సరైన కాంప్లిక్ట్ లేకపోతే ఇదిగో ఇలాగే విసిగిస్తుందని మరోసారి ప్రూవ్ చేసింది చిత్రం.
ఎవరెలా చేసారురాజ్ తరణ్ కు వంక పెట్టేందుకు లేదు..అతను ఫన్ ని బాగా ప్రెజెంట్ చేస్తాడు. ఇక మాళవిక నాయర్ ..న్యాచరల్ గా ఉంది. హెబ్బా పటేల్ గ్లామర్ కు అంకితమైంది. వాణి విశ్వనాధ్ జస్ట్ ఓకే. పోసాని,నరేస్ వంటి సీనియర్స్ ఎప్పటిలాగా అన్ని సినిమాల్లో లాగానే ఇందులోనూ ఉన్నారు. సినిమా మారింది కానీ వాళ్ళ పాత్రలు.బాడీ లాంగ్వేజ్ అన్ని కంటిన్యుటి.
ఏం బాగున్నాయిసప్తగిరి ..కామెడీ..(హాస్పటిల్ ఎపిసోడ్)హెబ్బాపటేల్ గ్లామర్ ..రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్మాళవిక నాయర్ నటనఏం బాగోలేదురాత, తీతపాతకాలం కథ,కథనం,తీసిన విధానం
టెక్నికల్ గాతనే కథ,స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ దర్శకుడు ఆ విషయంలోనే ఫెయిల్ అవటంతో ..డైరక్షన్ ఎలివేట్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా కెమెరా వర్క్ బాగుంది. అదే డైరక్షన్ అని పొరపడితే చేసేదేమీలేదు. అనూప్ ఇచ్చిన పాటల్లో ఆ మ్యాజిక్ లేదు. రెండు పాటలు బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమా చూస్తుంటే ఎడిటర్ పై కోపం వస్తుంది. ఇంకాస్త ట్రిమ్ చేసి మనని సేవ్ చేయచ్చు కదా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ..సినిమాకు తగినట్లుగా ఉన్నాయి.
ఫైనల్ థాట్బుజ్జిగాడు..కేమ్ ఫ్రమ్ నైంటీస్..---సూర్య ప్రకాష్ జోశ్యులRating: 25
ఎవరెవరు..బ్యానర్‌: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌నటీనటులు : రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ , హెబా పటేల్‌ ,వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ తదితరులు.మాటలు: నంద్యాల రవి,ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి,సంగీతం‌: అనూప్ రూబెన్స్డాన్స్‌: శేఖర్‌,ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌,ఫైట్స్‌: రియల్‌ సతీష్‌సమర్పణ‌: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌నిర్మాత: కె.కె.రాధామోహన్‌కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండావిడుదల తేదీ‌: అక్టోబ‌ర్ 1,2020ఓటీటీ‌: ఆహా

Latest Videos

click me!