ఎపిసోడ్ ప్రారంభంలో అర్జెంటు పని అంటే డెలివరీ మానుకొని మరి ఇక్కడికి వచ్చాను ఇదేనా ఆ గుడ్ న్యూస్ అంటూ విసుక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది అప్పు. అలా వెళ్ళిపోకు బ్రో నాకు సాయం చేయటానికి నువ్వు తప్ప ఎవరున్నారు అంటాడు కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నావ్ అంటుంది అప్పు. పేరు కనుక్కోమంటూ సవాల్ విసిరిన ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడానికి నువ్వే హెల్ప్ చేయాలి అంటూ అప్పుని రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్.