బాహుబలి ఫ్లాప్ అయి ఉంటే అందరం మునిగిపోయే వాళ్ళం..రాజమౌళి తోపాటు వణికిపోయిన మరో డైరెక్టర్

Published : May 05, 2025, 07:35 PM ISTUpdated : May 05, 2025, 07:36 PM IST

రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

PREV
15
బాహుబలి ఫ్లాప్ అయి ఉంటే అందరం మునిగిపోయే వాళ్ళం..రాజమౌళి తోపాటు వణికిపోయిన మరో డైరెక్టర్
Rajamouli

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాని శాసిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి ఇండియాలో అగ్ర దర్శకులలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో 1000 కోట్లు బడ్జెట్లో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు.

25

రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. రాఘవేంద్రరావు లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాహుబలి మూవీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు.

35

రాజమౌళి మొదట నాకు బాహుబలి కథ చెప్తానని అన్నారు. కానీ వద్దు నేను వినను, ఆడియన్స్ తో పాటే చూస్తాను అని చెప్పాను. కానీ కథ చాలా పెద్దది అయిపోయింది. ఏ పాత్రలు తీయాలో అర్థం కావడం లేదు. రెండు భాగాలుగా చేసే ఆలోచన కూడా ఉంది. ఒకసారి మీరు కథ వినండి అని రాజమౌళి అడిగారు. రాజమౌళి రిక్వెస్ట్ తో బాహుబలి కథ విన్నాను.

45

ఏ పాత్రలు తీయాల్సిన అవసరం లేదు. కొన్ని సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ జోడించి రెండు భాగాలుగా తీయండి అని చెప్పాను. ఆ విధంగా బాహుబలి రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం రిలీజ్ కాకముందే పార్ట్ 2 పై 60 కోట్లు బడ్జెట్ అప్పటికే పెట్టేసాం. ఒకవేళ బాహుబలి 1 తేడా కొడితే పరిస్థితి ఏంటి అనే భయం నాక్కూడా కలిగింది.
 

55

ఎందుకంటే మేం పెట్టిన బడ్జెట్ మా అందరి ఆస్తులు అమ్మినా కూడా సరిపోదు. కానీ రాజమౌళి డెడికేషన్ తో బాహుబలి అద్భుత విజయం సాధించింది అని రాఘవేంద్రరావు అన్నారు. బాహుబలి 1 విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆ టైంలో తాను చాలా భయపడ్డట్లు రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories