Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!

Published : Sep 21, 2026, 10:46 AM IST

Radhika Apte: కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో బోల్డ్ గా, న్యూడ్ గా నటించినంత మాత్రాన.. ఏది పడితే అది చేయమంటే ఎలా చేస్తాం అంటూ నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ స్పాట్ లో తనకెదురైన చేదు అనుభవాలను ఆమె బయటపెట్టారు.

PREV
15
బోల్డ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్..

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన రాధికా ఆప్టే.. ఇండియన్ స్క్రీన్ మీద బోల్డ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'లస్ట్ స్టోరీస్ 3'లో కొంకణా సేన్ శర్మ, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీలతో కలిసి ఆమె నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'జూమ్' ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ నాటి చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు.

25
కొందరు డైరెక్టర్లు తప్పుగా అర్థం చేసుకున్నారు..

కెరీర్ స్టార్టింగ్ లో నేను దాదాపు 4, 5 సినిమాల్లో పూర్తిగా న్యూడ్ గా నటించాను. అది చూసి ఇండస్ట్రీలో చాలామంది 'ఈమె ఏదైనా చేసేస్తుంది (యే తో కర్లేగీ నా)' అని ఫిక్స్ అయిపోయారు. కథకు అవసరం లేకపోయినా నేను బోల్డ్ సీన్స్ కు ఒప్పుకుంటానని కొందరు డైరెక్టర్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ నేను వాళ్ల మొహం మీదే 'గతంలో చేశాను కదా అని ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం లేదు, నేను కచ్చితంగా చేయను' అని తేల్చి చెప్పేశాను అని రాధికా ఆప్టే అన్నారు.

35
అవసరం లేకున్నా ముద్దు సీన్స్..

షూటింగ్ టైమ్ లో అనవసరంగా ముద్దు సన్నివేశాలు ఇరికించేవాళ్లని రాధికా ఆప్టే గుర్తుచేసుకున్నారు. 'హీరోకు ముద్దు పెట్టమంటే నేను ఎందుకు పెట్టాలి? ఈ సీన్ కథకు అవసరమా?' అని నేను అడగడం మొదలుపెట్టాను. దానికి వాళ్లు 'కొంచెమే కదా, చేసేయండి (కర్లో నా థోడా).. ఓ 15 సెకన్ల పాటు స్పాట్ ఇంప్రొవైజేషన్ లాగా ముద్దు పెట్టండి' అని చాలా క్యాజువల్ గా అడిగేవారు. అది విని 'సారీ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు' అని నేను డైరెక్ట్ గానే అడిగేదాన్ని అని ఆమె చెప్పారు.

45
షర్ట్ బటన్స్ విప్పేసి ఫైట్ చేయమన్నారు..

ఒక యాక్షన్ సీన్ షూటింగ్ లో నన్ను షర్ట్ బటన్స్ విప్పేసి ఫైట్ చేయమన్నారు. 'ఇది ఫైట్ సీన్, ఇందులో షర్ట్ దానంతట అదే కదులుతుంది, ఇది బేసిక్ ఫిజిక్స్. కావాలని బటన్స్ ఎందుకు విప్పాలి?' అని నేను అడిగాను. దానికి వాళ్లు 'అయితే షర్ట్ తీసేసి కేవలం బ్రా, లోదుస్తులతో ఫైట్ చేయగలరా?' అని అడిగారు. ఆ మాట వినగానే నాకు కోపం వచ్చి 'నాతో ఏం చేయించాలని చూస్తున్నారు?' అని గట్టిగా అడిగి రిజెక్ట్ చేశాను. ఆ సినిమా పేరు చెప్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు, అందుకే పేరు చెప్పను అని రాధికా ఆప్టే బాంబ్ పేల్చారు.

55
ప్రెజర్ చేయకూడదు..

ఒక నటి గతంలో బోల్డ్ , ఇంటిమేట్ సీన్స్ లో నటించిందని, ఎప్పుడూ అలాంటి సీన్స్ చేయడానికి రెడీగా ఉంటుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఒక సీన్ కథకు ఎందుకు అవసరం, దాని ఉద్దేశ్యం ఏంటి అనేది డైరెక్టర్లు క్లియర్ గా చెప్పాలి. సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో నటీనటుల ఇష్టానికి వ్యతిరేకంగా, వాళ్ల పర్సనల్ లిమిట్స్ క్రాస్ చేసి ఎవరూ ప్రెజర్ చేయకూడదు అని రాధికా ఆప్టే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories