Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?

Published : Sep 21, 2026, 09:44 AM IST

Jr NTR: భుజం గాయంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మళ్లీ రంగంలోకి దిగబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న ఆయన డ్రాగన్ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఇంతకీ తారక్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడో తెలుసా?

PREV
14
షూటింగ్ లో ఎన్టీఆర్ కు గాయం..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్'. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ కీలకమైన అప్‌డేట్ తాజాగా వెలువడింది. కొద్దిరోజుల క్రితం షూటింగ్ సమయంలో భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో తిరిగి ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారు అనే అంశంపై స్పష్టత వచ్చింది.

24
లాంగ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న ఎన్టీఆర్..

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ అక్టోబర్ మొదటి వారం నుంచి 'డ్రాగన్' కొత్త షెడ్యూల్‌లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. . గాయం కారణంగా హీరోకు చిన్నపాటి విరామం వచ్చినప్పటికీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సమయాన్ని ఏమాత్రం వృథా చేయలేదు. ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను, ఇతర నటీనటులతో కూడిన ముఖ్యమైన భాగాలను ఈ బ్రేక్ లో ఆయన కంప్లీట్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలియజేశాయి.

ఎన్టీఆర్ సెట్స్‌పైకి తిరిగొచ్చిన వెంటనే మిగిలిన భాగాన్ని నాన్‌స్టాప్‌గా చిత్రీకరించేందుకు మేకర్స్ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మారథాన్ షెడ్యూల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అంతేకాకుండా, ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లోనే 'డ్రాగన్' సీక్వెల్ కి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలను కూడా చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

34
మాస్ యాక్షన్ కథ.. సంచలన పాత్ర

ప్రశాంత్ నీల్ చిత్రాలంటేనే యూనివర్సల్ యాక్షన్, డార్క్ షేడ్స్‌కు కేరాఫ్ అడ్రెస్. ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ ఇంతకు ముందెన్నడూ కనిపించని సరికొత్త, విభిన్నమైన మాస్ లుక్‌లో అలరించనున్నారు. ఇంటర్నేషనల్ ఓపియం, హెరాయిన్ నెట్‌వర్క్‌పై ఆధిపత్యం సాధించేందుకు జరిగే ఘోరమైన యుద్ధం నేపథ్యంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అత్యంత క్రూరుడైన హంతకుడు 'లూగర్'గా ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసి అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చారు.

44
ఎవరెవరు నటిస్తున్నారంటే?

ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్, మలయాళ సీనియర్ యాక్టర్ బిజూ మీనన్, అలాగే హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా.. గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories