టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` షాకింగ్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌? ఎంత రాబట్టాలంటే?

Published : Mar 09, 2022, 08:07 PM IST

 పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నారు. అనేక వాయిదాల అనంతరం ఆయన నటించిన `రాధేశ్యామ్‌` చిత్రం ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగుతుంది. 

PREV
17
టార్గెట్‌ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` షాకింగ్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌? ఎంత రాబట్టాలంటే?

ఓ సినిమా సక్సెస్‌కి కలెక్షన్లే కొలమానం. ఎంత బడ్జెట్‌ పెట్టారు. ఎంత బిజినెస్‌ అయ్యింది. ఎంత వసూలు చేసిందనేదానిపైనే సినిమా హిట్‌ ఆధారపడి ఉంటుంది. బడ్జెట్‌ని దాటుకుని, రిలీజ్‌కి ముందు జరిగిన బిజినెస్‌ ని దాటుకుని వసూళ్లని రాబడితేనే సక్సెస్‌. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న `రాధేశ్యామ్‌`(Radheshyam Movie) చిత్రం అదే లెక్కలేసుకుని వస్తుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీగానే జరిగింది. మరి ఎంత పెట్టారు. ఎంతకి కొన్నారు. ఎంత రావాలనేది చూస్తే. 

27

ప్రభాస్‌కి `బాహుబలి` చిత్రంతో నేషనల్‌ వైడ్‌గానే కాదు, ఇతర దేశాల్లోనూ మంచి మార్కెట్‌ ఏర్పడింది. యూఎస్‌, చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ప్రభాస్‌కి అభిమానులున్నారు. `సాహో` చిత్రంతోనూ ఆ అభిమానం విస్తరించింది. ఇప్పుడు Radheshyamతో తన మార్కెట్‌ని, తన ఇమేజ్‌ని, తన క్రేజ్‌ని చాటుకోబోతున్నారు ప్రభాస్‌. ఈ చిత్రం దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. 

37

ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న `రాధేశ్యామ్‌` చిత్రానికి సంబంధించి ఇప్పటికే దాదాపు రూ.203 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌(Radheshyam Business) జరిగిందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. అయితే ఇందులో ఏ ఏరియాలో ఎంత బిజినెస్‌ జరిగిందనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుంటే. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రానికి సంబంధించి వంద కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని తెలుస్తుంది. అయితే ఏపీలో టికెట్ల రేట్ల పెంపుకి ముందే ఈ బిజినెస్‌ జరిగిన నేపథ్యంలో ఏపీలో కాస్త తక్కువగానే అయ్యిందని సమాచారం. 

47

తెలంగాణని మొత్తంగా నైజాంగా పరిగణిస్తారు. ఇక్కడ దాదాపు రూ.37కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని తెలుస్తుంది. నైజాంలో నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు.  ఏపీలో సీడెడ్(రాయలసీమ)రూ. 18 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.83కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.5కోట్లు, గుంటూరులో రూ. 9.9 కోట్లు, కృష్ణాలో రూ. 7.5 కోట్లు, నెల్లూరులో రూ. 4కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని సమాచారం. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 105.2కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. (ఇవి అధికారిక లెక్కలు కావు)

57

`రాధేశ్యామ్‌` చిత్రాన్ని తెలుగు రాష్టాలతోపాటు తమిళం, కన్నడ,మలయాళం, హిందీలోనూ విడుదల కాబోతుంది. తెలుగు రాష్టాల తర్వాత హిందీలో భారీగా బిజినెస్‌ జరిగిందట. సుమారు రూ.యాభై కోట్లకి హిందీ థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడు పోయినట్టు టాక్‌. హిందీలో ప్రభాస్‌కి మంచి మార్కెట్‌ ఉంది. డివైడ్‌ టాక్‌ వచ్చిన `సాహో`నే హిందీలో వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. దీంతో ఈ చిత్రానికి కూడా మంచి బిజినెస్సే జరిగిందని చెప్పొచ్చు. 

67

మరోవైపు సౌత్‌లో కన్నడలో రూ.12.5కోట్ల బిజినెస్‌, తమిళనాడులో రూ. 6కోట్లు, కేరళాలో కేవలం రెండు కోట్లే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని టాక్‌. అయితే సౌత్‌లో ప్రభాస్‌కి హిందీతో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటుంది. ఉన్నంతలో బెటర్‌గానే ఈ బిజినెస్‌ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇతర దేశాల్లోనూ ప్రభాస్‌కి మంచి మార్కెట్‌ ఉన్న నేపథ్యంలో ఓవర్సీస్ లో రూ.24కోట్ల బిజినెస్‌ జరిగిందని టాక్‌. మొత్తంగా `రాధేశ్యామ్` సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.203కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

77

ఈ భారీ టార్గెట్‌తో వస్తోన్న ప్రభాస్‌ టార్గెట్‌ని రీచ్‌ కావడం ఈజేనే  అయి అని మొదటి వారంలోనే టార్గెట్‌ ఫినిష్‌ చేసుకుని లాభాలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎంత కలెక్షన్లు(Radheshyam Collections) వసూలు చేస్తుంది. ఎలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `రాధేశ్యామ్‌` చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) నిర్మిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories