నాగచైతన్యతో తన డేటింగ్‌ సీక్రెట్ పంచుకున్న రాశీఖన్నా.. వారితో వెళ్తా అంటూ కోరికని బయటపెట్టి అందాల భామ..

Published : Jul 08, 2022, 03:55 PM ISTUpdated : Jul 08, 2022, 05:17 PM IST

అందాల భామ రాశీఖన్నా ఓ పెద్ద సీక్రెట్ ని బయటపెట్టింది. హీరోలందరికి షాకిస్తూ ఆటంబాంబ్‌ పేల్చింది. తాను ఎలాంటి వారితో డేట్‌కి వెళ్లాలనుకుంటోంది బయటపెట్టింది. ఇప్పుడు దుమారం రేపుతుంది.

PREV
17
నాగచైతన్యతో తన డేటింగ్‌ సీక్రెట్ పంచుకున్న రాశీఖన్నా..  వారితో  వెళ్తా అంటూ కోరికని బయటపెట్టి అందాల భామ..

రాశీఖన్నా(Raashi Khanna).. ఆ మధ్య టాలీవుడ్‌లో ఓ హీరోతో చనువుగా ఉంటుందనే రూమర్స్ వినిపించాయి. కానీ వాటిపై క్లారిటీ లేదు. ఇప్పటికీ అవి రూమర్స్ గానే ఉన్నాయి. మరోవైపు తాను డేటింగ్‌ చేసేందుకు సిద్ధమే అని చాలా సార్లు చెప్పింది. చెబుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆమె డేటింగ్‌ చేస్తున్నట్టు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ తాజాగా రాశీఖన్నా ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించింది. తాను ఎవరితో డేటింగ్‌ చేయాలనుకుంటుందో మనసులో మాట బయటపెట్టింది.

27

క్యూట్‌ అందాలతో కనువిందు చేసే రాశీఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె `పక్కా కమర్షియల్‌` చిత్రంతో మెప్పించింది. ఇప్పుడు నాగచైతన్య(Naga Chaitanya)తో కలిసి `థ్యాంక్యూ`(Thank You) చిత్రంలో నటించింది. ఈచిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా నాగచైతన్యంతో కలిసి ఓ వీడియో చిట్‌చాట్‌లో పాల్గొంది. 
 

37

ఇందులో నాగచైతన్య, రాశీఖన్నాలు ఒకరి గురించి ఒకరు యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. రాశీఖన్నా గురించి ఒకటి తప్ప అన్నీ కరెక్ట్ గా చెప్పాడు నాగచైతన్య. మరోవైపు ఆయన గురించి మాత్రం రాశీ అన్నీ నిజాలే చెప్పింది. ఇందులో భాగంగానే ఓ సంచలన విషయం, షాకింగ్‌ విషయం బయటపెట్టింది. 

47

రాశీఖన్నా డేటింగ్‌కి (Rasshi Khanna Dating)సంబంధించి యాంకర్‌ ప్రశ్నలు అడిగారు. రాశీఖన్నా ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌తో డేట్‌కి వెళ్లాలనుకుంటుంది, డాక్టర్‌తో డేట్ కి, ఆర్కిటెక్చర్‌తో డేట్‌కి వెళ్లాలనుకుంటుందని అడగ్గా, అందులో ఏది నిజమనేది నాగచైతన్య చెప్పాల్సి ఉంది. అందుకు నాగచైతన్య ఐఏఎస్‌ ఆఫీసర్‌తో అని తప్పు ఆన్సర్‌ చెప్పాడు. 

57

కానీ అసలు నిజం రాశీఖన్నా చెప్పింది. తాను హీరోయిన్‌ కాకముందు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని అనుకుందట. స్కూల్‌లో తాను టాపర్‌ అని, బాగా చదువుతానని తెలిపింది. కానీ డేట్‌కి మాత్రం ఓ డాక్టర్‌తో వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది. దీంతో నాగచైతన్య ఫన్నీగా స్పందించారు. డాక్టర్లందరూ ఇది వింటున్నారా? అందరు ఆసుపత్రి మానేసి రాశీ ఇంటి బయట వెయిట్‌ చేస్తారని చెప్పడం నవ్వులు పూయించింది. 

67

ఈ ఇంటర్వ్యూలో రాశీఖన్నా తన రెండు సీక్రెట్స్ ని బయటపెట్టింది. ఇప్పుడిది వైరల్‌తోపాటు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరోవైపు నాగచైతన్య ఫుడ్‌ నుంచి, కార్ల వరకు రాశీఖన్నా అన్నీ నిజాలే చెప్పడం విశేషం. ప్రస్తుతం రాశీ, నాగచైతన్య చిట్‌చాట్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్లో ఉండటం విశేషం. నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన `థ్యాంక్యూ` చిత్రానికి విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో రాశీతోపాటు మాళవిక మోహనన్‌, అవికా గోర్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు.

77

ఈ సినిమా జులై 22న విడుదల కాబోతుంది. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. ఈ నెలలో రాబోతున్న చిత్రాల్లో అత్యంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న చిత్రాల్లో `థ్యాంక్యూ` ఒకటి కావడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories