బాలీవుడ్ లో రష్మిక మందన్నకు మరో బంపర్ ఆఫర్ .. టైగర్ ష్రాఫ్ సరసన నటించనున్న శ్రీవల్లి..

Published : Jul 08, 2022, 03:24 PM IST

ఆలిండియా క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ యంగ్ స్టార్ అండ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించే ఛాన్స్ అందుకుందని సమాచారం.  

PREV
16
బాలీవుడ్ లో రష్మిక మందన్నకు మరో బంపర్ ఆఫర్ .. టైగర్ ష్రాఫ్ సరసన నటించనున్న శ్రీవల్లి..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సౌత్ లో బడా హీరోల సరసన నటించి ఆల్ ఇండియా క్రష్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ సరసన హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది.  
 

26

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. శ్రీవల్లి లైనప్ చూస్తుంటే మతిపోతోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్లకే ధీటుగా నిలుస్తోంది. యంగ్ బ్యూటీ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో అటు దర్శక నిర్మాతలు కూడా రష్మిక వైపే చూస్తున్నారు. 
 

36

ఇప్పటికే  బాలీవుడ్ లో మూడు చిత్రాల్ ల్లో నటిస్తోంది రష్మిక. కాగా తాజాగా మరో ఆఫర్ ను సొంతం చేసుకున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ యంగ్ అండ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు బీ-టౌన్ వర్గాల నుంచి సమాచారం.

46

టైగర్ ష్రాఫ్ - రష్మిక నటించబోతున్న ఈ చిత్రాన్నికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శశాంక్ ఖైతాన్ (Shashank Khaitan) డైరెక్ట్ చేయబోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (Karan Johar) చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా దర్శకుడు శంశాక్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. 
 

56

ప్రస్తుతం నటీనటుల ఎంపికలో నిమగ్నమయ్యారంట శంశాక్. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్ తో అద్భుతమైన యాక్షన్ ఫిల్మ్ ను రూపొందించే పనిలో ఉండగా.. హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక  చేసినట్టు బజ్ క్రియేట్ అయ్యింది. ఇదే నిజమైతే బాలీవుడ్ లో రష్మిక కేరీర్ కు గట్టి పునాది పడ్డట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ కూడా ఈ చిత్రం  కోసం ప్రిపరేషన్ వర్క్ ను స్టార్ట్ చేశారంట. సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు మేకర్స్.   
 

66

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరనన ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రంలో రష్మిక మందన్న ‘శ్రీవల్లి’ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే రష్మిక పాపులారిటీ బాలీవుడ్ వరకు పాకింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో పాటు పుష్ప : ది రూల్ (Pushpa The Rule)లోనూ నటిస్తోంది. అలాగే ‘సీతారామం’, తమిళంలో ‘వారసుడు’, హిందీలో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’, ‘యానిమల్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories