
చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), నాగార్జున(Nagarjuna) కలవబోతున్నారు. ముగ్గురు ఒకేసారి రాబోతుంది. ముగ్గురు సీనియర్లు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయబోతున్నారు. ముగ్గురు హీరోల అభిమానులు పండగా చేసుకోబోతున్నారు. ఈ ముగ్గురి సినిమాలు ఒకేసారి విడుదల కాబోతుండటం విశేషం. అందుకు దసరా పండుగ సందర్భం కాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల `ఆచార్య`తో నిరాశ పరచగా ఇప్పుడు `గాడ్ ఫాదర్`(God Father)తో ఎన్నో అంచనాలతో రాబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. ఫ్యాన్స్ పండగా చేసుకున్నారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో వాహ్ అనేలా ఉన్నారు చిరు. ఈ లుక్‌సినిమాపై అంచనాలను పెంచింది. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్`కిది రీమేక్ అనే తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆల్మోస్ట్ రిలీజ్ డేట్‌పై క్లారిటీతో ఉన్నారు. దసరాకి విడుదల చేయాలని భావిస్తుంది. అక్టోబర్ 5 విజయదశమి కానుకగా సినిమారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. డేట్ అఫీషియల్ గా ప్రకటించకపోయినా, దర్శక, నిర్మాతలు, చిరంజీవి సైతం పండగ టార్గెట్‌తోనే ముందుకెళ్తున్నారు.
ఇదే రోజు మాస్ కి కేరాఫ్‌గా నిలిచే బాలయ్య(Balakrishna) సైతం బరిలోకి రాబోతున్నారట. ఆయన ప్రస్తుతం `ఎన్బీకే107` (NBK107)చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్, మాస్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.
జనరల్‌గా చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తీవ్రమైన పోటీ ఉంటుంది. పండక కావడంతో ఆ పోటీ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇటీవల `అఖండ`తో బాలయ్య బ్లాక్ బస్టర్ సాధించి మంచి ఊపులో ఉన్నాడు. దీంతో ఆయన అభిమానులు కూడా తగ్గేదెలే అనేలా ఉన్నారు. దీంతో వారి రచ్చ మామూలుగా ఉండకపోవచ్చు. ఆ విషయంలో మెగాస్టార్ ఫ్యాన్స్ తక్కువగా కాదు. దీంతో అటు థియేటర్ల వద్ద, ఇటు సోషల్ మీడియాలోనూ వార్ పీక్‌లో నడుస్తుంది.
ఇద్దరు సీనియర్ల అభిమానుల వార్ కొన్ని రోజులుగా జరుగుతుండగా, ఇప్పుడు మరో సీనియర్ స్టార్ నాగార్జున రంగంలోకి దిగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన నటిస్తున్న `ది ఘోస్ట్` చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. చిరు, బాలయ్య ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయకపోయినా నాగ్ మాత్రం ముందుస్తు జాగ్రత్తతో విడుదల తేదీ ఇచ్చి దసరా బరిలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఈ దసరాకి రచ్చ మామూలుగా ఉండబోదంటున్నారు క్రిటిక్స్.
జనరల్‌గా చిరు, బాలయ్య మధ్యే తీవ్రమైన పోటీ ఉంటుంది. వారి మధ్య నాగ్ (Nagarjuna) వెళితే ఆ మజా మరో లెవల్‌లో ఉంటుందని భావిస్తున్నారు సినీ ప్రియుడు. దసరా పోటీ ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు. ఇక `ది ఘోస్ట్`(The Ghost) చిత్రంతో నాగార్జున హీరోగా నటిస్తుండగా, సోనాలి చౌహాన్ కథానాయిక, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందబోతుంది. కొత్త జోనర్‌లో రాబోతుండటంతో ఆసక్తి నెలకొంది. `వైల్డ్ డాగ్` తర్వాత నాగ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.
నాగార్జున నటించిన `శివ` చిత్రం 1989న అక్టోబర్ 5నే విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు అదే డేట్‌కి `ది ఘోస్ట్` రాబోతుండటం, తన కెరీర్‌లోనే ఇదొక కొత్త తరహా సినిమా అని నాగార్జున చెప్పడం విశేషం. అప్పటి మ్యాజిక్ ఏదైనా జరుగుతుందా అనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇదిలా చిరంజీవి, నాగార్జున ఇండస్ట్రీలో మంచి స్నేహితులు, కలిసి బిజినెస్‌లు చేస్తుంటారు. ఇండస్ట్రీ విషయంలో ఇద్దరూ ముందుంటారు. అలాంటి వీరిద్దరి సినిమాలు పోటీ పడబోతుండటం ఆసక్తికరంగా మారింది.