కన్నడ అందం, బ్యూటీఫుల్ హీరోయిన్ రాయ్ లక్ష్మి (Raai Laxmi) కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. విభిన్నపాత్రలు పోషిస్తూనే స్పెషల్ సాంగ్ లతోనూ అదరగొడుతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తోంది.
తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో ఎక్కువ సందడి చేసింది. ఈ ముద్దుగుమ్మ ‘కాంచనమాల కేబుల్ టీవీ’, ‘నీకు నాకు’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్నేళ్లకు స్పెషల్ సాంగ్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఊర్రూతలూగించింది.
‘బలుపు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘ఖిలాడీ నెంబర్ 150’, ‘ది లెజెండ్’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి థియేటర్లలో అందాల మెరుపులు మెరిపించింది. తన డాన్స్ తో ఆకట్టుకుంది. గ్లామర్ తోనూ మైమరిపించింది. ఇప్పటికీ వరుసగా అలరిస్తూనే వస్తోంది.
అటు సినిమాల్లో బిజీగానే ఉన్న లక్ష్మి రాయ్ సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. మొన్నటి వరకు తన వెకేషన్ నుంచి బీచ్ వేర్స్, బికినీల్లో కనిపించి మంటలు పుట్టించింది. తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది.
తన అందాల వరదకు లక్ష్మి రాయ్ అడ్డుకట్ట వేసి సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. లెహంగా వోణీ, మ్యాచింగ్ జ్యూయెల్లరీలో ఈ ముద్దుగుమ్మ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. పద్ధతిగా మెరిసి మైమరిపించింది.
రాయ్ లక్ష్మిని పద్ధతిగా చూడాలని ఆశించిన అభిమానులకు ట్రెడిషనల్ లుక్ తో ట్రీట్ ఇచ్చింది. తన బ్యూటీఫుల్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో రాయ్ లక్ష్మి ఎంత అందంగా ఉందోనంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.