Husharu 2 Teaser: క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా ఆర్‌ నారాయణ మూర్తి, థియేటర్లో బ్లాస్టే.. హుషారు 2 టీజర్ ఎలా ఉందంటే?

Published : Oct 27, 2026, 07:33 PM IST

Husharu 2 Teaser: పీపుల్‌ స్టార్‌ ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు సాహసం చేశారు. క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. అందులో భాగంగా `హుషారు 2` మూవీలో నటించారు. ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

PREV
16
సమాజంలోని లోపాలను ఎత్తిచూపే పీపుల్‌ స్టార్‌ ఆర్‌ నారాయణమూర్తి

పీపుల్‌ స్టార్‌ ఆర్‌ నారాయణమూర్తి అభ్యుదయ చిత్రాలతో మెప్పించారు. వామపక్ష భావజాలంతో కూడిన సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. దేశంలో జరిగే అన్యాయాలను తన సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాలు చేసే మోసాలను, కుట్రలను, అమాయక ప్రజలను ఓటుగా మార్చుకొని మోసం చేస్తున్న తీరుని, నిరుద్యోగం, చదువులు, కార్మికుల సమస్యలు ఇలా పేదల కోసం సినిమాలు చేశారు. వారి సమస్యలను ఎత్తిచూపేలా మూవీస్‌ చేశారు. సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు. ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనే నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి సినిమాలు చేసి మెప్పించారు. ఇటీవల ఆయన సినిమాలు తగ్గించారు.

26
క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్న ఆర్‌ నారాయణ మూర్తి

ఆయన్నుంచి సినిమా రాక చాలా రోజులవుతుంది. ఆ మధ్య సినిమా వచ్చినా అది ఆదరణ పొందలేదు. ఈ క్రమంలో తన కెరీర్‌లో డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు ఆర్‌ నారాయణమూర్తి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారారు. `హుషారు 2` సినిమాలో ఆయన క్యారెక్టర్‌ చేయడం విశేషం. నక్సలైట్‌ పాత్రలో ఆయన కనిపించారు. ఒక మంచి సందేశం అందించేలా ఆ పాత్ర ఉంటుందని సమాచారం. హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్ల మీద రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం `హుషారు 2`. ఈ మూవీకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్‌ని నేడు మంగళవారం విడుదల చేశారు. ఇందులో ఆర్‌ నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు.

36
హుషారు 2 మూవీ టీజర్‌ ఎలా ఉందంటే?

`హుషారు 2` మూవీ టీజర్‌ ఎలా ఉందంటే, `ప్రతీ గడపకు ఓ క‌థ ఉంటుందంటారు. కానీ ఈ చిత్ర‌గుంజ్‌లో ప్ర‌తీ గ‌డ‌ప‌కు ఒకే క‌థ‌. అంద‌రి ఇంటి పేరు ఒక్క‌టే భ‌యం. ఒక వైపు ర‌క్తంతో రాజ్యాన్ని ప‌రిపాలించే రాక్ష‌సుడు. మ‌రోవైపు అడ‌విలో క్రూరంగా వేటాడే సాయుధులు వీళ్ల మ‌ధ్య‌లో న‌లిగి పోతున్న ప్ర‌జ‌లు ఒక నాయ‌కుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ‌రా నాయ‌కుడు` అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ‘హుషారు 2’ టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది. ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన హుషారుకు సీక్వెల్ ఇంత యాక్ష‌న్ మోడ్‌లో రాబోతుందా! అనే డౌట్ అంద‌రి వ‌చ్చేసే లోపు.. రాహుల్ రామ‌కృష్ణ ‘అరే చంద్ర‌మోహ‌న్ ఆపు.. నీ స్టోరీకి, ఎమోష‌న్స్‌కి ఏమైనా సంబంధం ఉందా టోట‌ల్ డిస్‌క‌నెక్ట్?’ అని గ‌ట్టిగా అర‌వ‌టంతో మొత్తం సీన్ మారిపోయింది.

46
కామెడీ, యాక్షన్‌ ప్రధానంగా సాగిన హుషారు 2 టీజర్‌

బాయ్స్ ఆర్ బ్యాక్ అనే క్యాప్ష‌న్‌తో సినిమా షూటింగ్ లొకేష‌న్‌లో సీన్ మొద‌ల‌వుతుంది. అడ‌విలో అరుపులు అనే సినిమాను చేస్తున్న‌ట్లు చూపించారు. రాహుల్ రామ‌కృష్ణ త‌న న‌లుగురు బాయ్స్‌తో క‌లిసి ఓ క్రేజీ ఐడియాను నిజం చేసుకోవ‌టం కోసం చిత్ర‌గుంజ్‌కు చేరుకుంటాడు. అక్క‌డ నుంచి క‌థ ఎన్నో మ‌లుపులు తిరుగుతుంది. ఓ వైపు విల‌న్స్‌.. మ‌న క్రేజీ కుర్రాళ్ల గ్యాంగ్‌ను చంప‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. వీళ్లేమో త‌ప్పించుకుని పారిపోతుంటారు. చివ‌ర‌కు వాళ్లు న‌క్స‌లైట్స్ చేతికి చిక్కుతారు. అక్క‌డ న‌క్స‌ల్స్ నాయ‌కుడు పాత్ర‌లో పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. `త‌మ్ముళ్లు వేట మొద‌లెడ‌దామా` అనే ఆయ‌న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో టీజ‌ర్ ముగిసింది. టీజ‌ర్ చూస్తుంటే హుషారు 2లో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, యాక్ష‌న్ పార్ట్ కూడా ఉండ‌బోతుంద‌నేది తెలుస్తుంది. ఇంత‌కీ విల‌న్స్ మ‌న హీరో బ్యాచ్‌ను ఎందుకు చంపాల‌నుకుంటారు? అనే విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. 2018లో విడుదలైన `హుషారు`యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌గా ఆకట్టుకుంది. దానికి సీక్వెల్‌గా `హుషారు 2`ని రెట్టింపు ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు.

56
సందేశమిచ్చే హుషారు 2 -ఆర్‌ నారాయణమూర్తి

ఈ కార్యక్రమంలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, `హర్ష గారు ‘హుషారు 2’లో నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. ‘హుషారు’లో ఎంత నవ్వించారో.. అంతకు మించి నవ్విస్తూనే, ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను ఎంతో గొప్పగా చూపించారు. పని హక్కుని కోల్పోతోన్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లేదు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు హర్ష ఎక్కడా కూడా రాజీ పడడు. రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు హర్షలో ఆ క్వాలిటీ కనిపించింది. కెమెరామెన్ ఎంతో ఓర్పుగా ఉన్నాడు. సినిమా నచ్చితే ప్రజలు ఎవరినైనా సరే స్టార్‌లను చేస్తారు. అలా ఈ మూవీని జనాలకు నచ్చేలా హర్ష తీశారు. ‘హుషారు 2’ మూవీని జనాల వద్దకు తీసుకు వెళ్లాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను` అని అన్నారు.

66
రియల్‌ సంఘటనలతో హుషారు 2

దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ, `హుషారు` నా జీవితంలో బెస్ట్ మెమోరీ. రెండో పార్ట్‌ని ఏదో తీయాలని తీయలేదు. నా జీవితంలో నా స్నేహితులతో కలిసి ఫేస్‌ చేసిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ తీశాను. నా చిన్ననాటి ఫ్రెండ్ రాహుల్ వర్మ ఈ సినిమాతో నిర్మాణంలోకి వచ్చాడు. ఈ చిత్రంలో రాహుల్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. సినిమాని చూస్తే అశోక్ గల్లా, శశి, దినేష్, రవి ఆంటోనీ రియల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్‌లా కనిపిస్తారు. ఆర్‌ నారాయణమూర్తి గారితో వర్క్ చేయడం ప్రైస్ లెస్ మూమెంట్స్. ఆయనతో ఉండే సీన్స్ థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి` అని అన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories