ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’. 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పరాజ్ మేనరిజం, ‘తగ్గేదే లే’ లాంటి డైలాగ్స్, సాంగ్స్ ఎంతలా ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.