సెకండ్స్ కాదు, మిల్లీ సెకండ్స్ లో అతని ప్రేమలో పడిపోయా... కొత్త లవర్ ని పరిచయం చేసిన రష్మిక!

First Published Jun 8, 2021, 9:32 AM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో రష్మిక మందాన ఒకరు. వరుస హిట్స్ తో జోరుమీదున్న రష్మిక చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదా పట్టేశారు. పట్టిందల్లా బంగారం అన్న తీరుగా రష్మిక నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 

గత ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక, నితిన్ కి భీష్మ రూపంలో సూపర్ హిట్ ఇచ్చింది. కరోనా ఇయర్ గా ముగిసిన 2020లో కూడా రష్మిక రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
undefined
వీటన్నింటికీ మించి పుష్ప మూవీలో ఆఫర్ దక్కించుకోవడం ద్వారా బంపర్ ఛాన్స్ కొట్టేసింది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది.
undefined
రష్మిక నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప కావడం విశేషం. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప సిరీస్ పై భారీ హైప్ ఉంది. రశ్మికకు పారితోషికం కూడా గట్టిగానే ముట్టినట్లు సమాచారం.
undefined
ఇక రష్మిక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే కెరీర్ బిగినింగ్ లోనే ఘాడమైన ప్రేమలో మునిగి తేలింది రష్మిక. కిరాక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. నిశితార్థం కూడా జరిగాక అతనికి హ్యాండిచ్చి బ్రేకప్ చెప్పింది.
undefined
అప్పట్లో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమ వ్యవహారం కన్నడ మీడియాలో హాట్ టాపిక్. టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాక హీరో విజయ్ దేవరకొండకు ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. ప్రైవేట్ పార్టీలు, డిన్నర్ పార్టీలకు జంటగా వెళుతున్న ఈ జంట మధ్య ఏదో నడుస్తుంది పరిశ్రమ వర్గాల భోగట్టా.
undefined
ఈ విషయంపై ఇద్దరూ నోరుమెదపడం లేదు. కాగా తన కొత్త లవర్ ని ఇంస్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది రష్మిక. ఆ కొత్త లవర్ ఎవరో కాదు తన పెట్ డాగ్ ఆరా. ఇన్ని ప్రతికూలత మధ్య తనకు సంతోషం పంచేవాడు ఆరా అని చెబుతుంది రష్మిక.
undefined
ఎవరైనా ప్రేమలో మూడు సెకండ్స్ లో పడిపోతారని అంటారు. నేను ఆరా ప్రేమలో మూడు మిల్లీ సెకండ్స్ పడిపోయానని రష్మిక కామెంట్ పెట్టారు. ఇక బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక.
undefined
click me!