Allu Arjun Remuneration: ఐకాన్‌ స్టార్‌కి వంద కోట్ల ఆఫర్‌.. నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ?

First Published | Jan 24, 2022, 6:44 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. రేంజ్‌ రెండేళ్లలో ఊహించని విధంగా మారిపోయింది. `అల వైకుంఠపురములో` ఊహించిన విజయం, `పుష్ప` షాకింగ్‌ బ్లాక్‌ బస్టర్స్ బన్నీ రేంజ్‌ని మార్చేశాయి. పాన్‌ ఇండియా స్టార్స్ జాబితాలో చేరిపోయారు. 
 

అల్లు అర్జున్‌(Allu Arjun) నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం 2020సంక్రాంతికి విడుదలై రెండు వందల కోట్లు వసూలు చేసింది. సింపుల్‌ స్టోరీని అంతా ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. దీంతో ఆ సినిమా ఊహించిన విధంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. నాన్‌ `బాహుబలి` రికార్డ్ లను తిరగ రాసింది. దీంతో బన్నీ స్థాయి పెరిగింది. 

ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో `పుష్ప` చిత్రంతో ప్రయోగం చేశారు Allu Arjun. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించారు. కంటెంట్‌ యూనివర్సల్‌ కావడంతో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేశారు. డిసెంబర్‌ 17న అనేక అవాంతరాలతో, టైట్‌ షెడ్యూల్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి మొదట మిశ్రమ స్పందన లభించింది. సినిమా ఈ స్థాయిలో సక్సెస్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆ తర్వాత ఇది సంచలనాలు క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా హిందీలో దుమ్ములేపింది. అసలుప్రమోషన్‌ చేయకుండానే బాలీవుడ్‌లో ఇది ఎనభై కోట్లు వసూలు చేసి ట్రేడ్‌ వర్గాలనే కాదు, చిత్ర యూనిట్‌ని సైతం షాక్‌కి గురి చేసింది. 


యాక్షన్‌ చిత్రాలకు బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉంది. ప్రభాస్‌ నటించిన `సాహో` సైతం అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు `పుష్ప` దాన్ని కంటిన్యూ చేస్తూ దుమ్ములేపింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. టోటల్‌గా `పుష్ప` చిత్రం మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. సౌత్‌లో ప్రభాస్‌, రజనీకాంత్‌ చిత్రాలు ఈ స్థాయి కలెక్షన్లని సాధించాయి. ఇప్పుడు బన్నీ ఆ జాబితాలో చేరిపోయారు. పాన్‌ ఇండియా స్టార్‌ ట్యాగ్‌ని వేసుకున్నారు. అదే ఊపుతో ఇప్పుడు బన్నీ `పుష్పః ది రూల్‌` చిత్రం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా కూడా ఆల్మోస్ట్ ఖరారైనట్టు తెలుస్తుంది. వేణు శ్రీరామ్‌తో `ఐకాన్‌`, కొరటాల శివతో ఓ చిత్రం, ప్రశాంత్‌ నీల్‌తో, బోయపాటి, ఏఆర్‌ మురుగదాస్‌తో వరుసగా సినిమాలు బన్నీ లైనప్‌లో ఉన్నాయి. కానీ `పుష్ప` రెండో భాగం తర్వాత ఐకాన్‌ స్టార్‌ తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్నారట. దీన్ని కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నారని, లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. 

అయితే నెక్ట్స్ ఈ సినిమా కోసం బన్నీకి భారీగా ఆఫర్‌ చేసిందట లైకా. ఏకంగా వంద కోట్ల పారితోషికం ఆఫర్‌ చేసిందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇటీవలే దీనికి సంబంధించి దర్శకుడు అట్లీ, లైకా నిర్మాతలతో చర్చలు జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్‌. `పుష్ప` మొదటి భాగమే మూడు వందల కోట్లు వసూలు చేస్తే, అసలైన కథ ఉన్న `పుష్ప 2` ఈజీగా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని భావించిన లైకా నిర్మాతలు అట్లీతో సినిమాని భారీగా ప్లాన్‌ చేశారని, అందుకోసం బన్నీకి వంద కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినట్టు టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!