`పుష్ప-పుష్ప2`కి ఉన్న పోలికలు, తేడాలు.. సుకుమార్‌ చేసిన మ్యాజిక్ ఏంటి?

Published : Dec 05, 2024, 05:50 PM IST

`పుష్ప 2` సినిమా ప్రస్తుతం థియేటర్లలో రచ్చ చేస్తుంది. మరి మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి, దీనికి ఉన్న తేడా ఏంటి? పోలికలేంటి? సుకుమార్‌ చేసిన మ్యాజిక్‌ ఏంటనేది చూద్దాం.   

PREV
16
`పుష్ప-పుష్ప2`కి ఉన్న పోలికలు, తేడాలు.. సుకుమార్‌ చేసిన మ్యాజిక్ ఏంటి?

ప్రస్తుతం ఇండియా వైడ్‌గా `పుష్ప 2` హంగామా నడుస్తుంది. ఈ సినిమా మాస్‌ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. మల్టీఫ్లెక్స్‌ ఆడియెన్స్ ద్వారా కూడా మంచి స్పందననే లభిస్తుంది. సినిమాకి వస్తున్న స్పందన, టాక్‌ని చూస్తుంటే ఇది భారీగానే వసూళ్ల వర్షం కురిపించబోతుందని తెలుస్తుంది. 

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

26

మరి మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి, ఇప్పుడు థియేటర్లలో రచ్చ చేస్తున్న `పుష్ప 2`కి ఉన్న పోలికలు ఏంటి? తేడాలు ఏంటి? కొత్తగా ఇందులో సుకుమార్‌ ఏం చూపించాడు? ఆయన చేసిన మ్యాజిక్‌ ఏంటనేది చూద్దాం. సినిమా లైన్‌ ప్రకారం సిమిలారిటీస్‌ ఉంటాయి. `పుష్ప`లో కూలీగా స్టార్ట్ అయిన పుష్పరాజ్‌ జర్నీ నెమ్మదిగా ఎదుగుతూ సిండికేట్లకు సహాయం చేస్తూ ఒక సిండికేట్‌గా ఎదుగుతాడు.

రెండో పార్ట్ లో సింగిల్‌ సిండికేట్‌ మెంబర్‌ నుంచి సిండికేట్‌కి శాషించే స్థాయికి సిండికేట్‌ హెడ్‌గా ఎదుగుతాడు. స్టేట్‌ నుంచి ఇంటర్నేషనల్‌గా ఎదగడం రెండో పార్ట్ లో చూపించారు. అంతేకాదు సీఎంలను మార్చే స్థాయికి ఎదగడం కొత్త ఎలిమెంట్ గా చెప్పొచ్చు. 
 

36

పాటలు `పుష్ప`లో మాదిరిగానే డిజైన్‌ చేశారు. `పుష్ప పుష్ప`, దాక్కో దాక్కో మేకలా ఉంటుంది. మిగిలిన పాటలు రష్మిక, బన్నీ మధ్య రొమాంటిక్‌ సన్నివేశాల్లో వస్తాయి. రొమాన్స్ కూడా సేమ్‌ ఫాలో అయ్యారు. కాకపోతే అందులో లవర్స్ గా ఇందులో భార్యా భర్తలుగా.

`పుష్ప`లో ఊ అంటావా మావ ఐటెమ్‌ సాంగ్‌ పార్టీ సమయంలో వస్తుంది. ఇందులోనూ రావు రమేష్‌ సీఎం అయ్యాక పార్టీ మూడ్‌లో `కిస్సిక్‌` సాంగ్‌ వస్తుంది. పాటల విషయంలోనూ సేమ్‌ పంథాని ఫాలో అయ్యాడు సుకుమార్‌. 

46

ఇక `పుష్ప`లో పోలీస్‌ స్టేషన్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. ఇందులోనూ అలాంటి ఎపిసోడే పెట్టారు. `పుష్ప`లో క్లైమాక్స్ లో షేకావత్‌తో గొడవ, ఇందులో ఇంటర్వెల్‌ సమయంలో గొడవ. క్లైమాక్స్ లో మరో బిగ్‌ షాట్‌ ప్రతాప్‌ రెడ్డితో వైరం. స్క్రీన్‌ ప్లే డిజైన్‌ చేసిన తీరు సేమ్‌ ఉంటుంది.

అందులో కారుని కొనేస్తాడు. ఇందులో విమానం కొనేస్తాడు. అందులో అధికారులను కొంటాడు. ఇందులో ఎమ్మెల్యేలు కొంటాడు. అందులో పోలీసులకు సరుకు దొరకకుండా రెండు సార్లు దాస్తాడు. ఇందులోనూ పోలీసులకు దొరకకుండా రెండుసార్లు తప్పిస్తాడు. కాకపోతే దీని రేంజ్‌ వేరే. 

56

యాక్షన్‌ సీన్ల విషయంలోనూ సేమ్‌ ఫాలో అయ్యాడనిపిస్తుంది. `పుష్ప`లో మధ్యలో ఫారెస్ట్ లో తనని చంపేసేందుకు విలన్లు ప్లాన్‌ చేస్తారు. చేతులు కట్టేసినా అలానే ఫైట్ చేస్తాడు. అది హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో క్లైమాక్స్ లో చేతులు కట్టేస్తే చేసే ఫైట్‌ హైలైట్‌గా నిలుస్తుంది.

అయితే దీన్ని డిజైన్‌ చేసిన తీరు వేరే లెవల్లో ఉంటుంది. మరోవైపు రష్మికని జాలి రెడ్డి రాత్రికి రమ్మన్నాడని తెలిసి వాడి ఇంటికి వెళ్లి కొడతాడు. ఇందులో జాతర సీన్‌లో అన్న కూతురుని అవమానించిన విలన్లని చితక్కొడతాడు. 

66

ఇందులో అమ్మోరు గెటప్‌లో ఆయన విశ్వరూపం వేరే లెవల్‌లో ఉంటుంది. `పుష్ప 2`లో ఇదే హైలైట్‌. ఇదేకొత్త పాయింట్‌. దీనితోపాటు జగపతిబాబు పాత్ర కొత్తగా యాడ్‌ అవుతుంది. మైనింగ్‌ కింగ్‌గా ఆయన మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఆయనతోనే వైరం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఫ్యామిలీలో అవమానాల కామన్‌గానే ఉంటాయి. అయితే చివర్లో కలిసిపోవడం హైలైట్‌గా చెప్పొచ్చు.

`పుష్ప`కి దేవిశ్రీ ప్రసాద్‌ ఒక్కడే మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌ ఇచ్చాడు దీనికి బీజీఎం కి ముగ్గురు వర్క్ చేశారు. `పుష్ప`లో క్యారెక్టర్‌ బేస్డ్ గా సినిమా సాగుతుంది. ఇందులోనూ సేమ్‌ కానీ, ఎలివేషన్లకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు సుకుమార్‌, వాటి డోస్‌ పెంచాడు. డెప్త్ గా చూస్తే మిగిలినదంతా సేమ్‌ టూ సేమ్‌. ఒకే ఫార్మాట్‌ని అటూ ఇటుగా తిప్పి పాత్రలు, సందర్భాలు, సన్నివేశాలు వేరుగా పెట్టి తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్‌. తన మార్క్ మ్యాజిక్‌ చేశాడు. అందులో ఎదగడం, ఇందులో రూల్‌ చేయడమే తేడా. 

read more: `పుష్ప 2ః ది రూల్‌` సినిమాలో 5 హైలైట్స్.. థియేటర్లలో పూనకాలు తెప్పించే ఎలిమెంట్లు ఇవే

also read: పుష్ప 2: మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన డైలాగ్స్ నిజమేనా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories