డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు పూరి జగన్నాధ్ కెరీర్ కి మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బాగా దెబ్బేశాయి. ఆర్థికంగా పూరికి ఈ చిత్రాలు డ్యామేజ్ కలిగించాయి.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో పూరి జగన్నాధ్ ని నమ్ముకున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ శ్రీను వివాదం ఆల్రెడీ హైలైట్ అయింది. ఇప్పుడు పూరి జగన్నాధ్, ఛార్మి బాధితుల లిస్ట్ లో మరో ప్రముఖులు చేరారు. వాళ్ళు ఎవరో కాదు హను మాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి.
లైగర్ లాంటి డిజాస్టర్ కళ్ళ ముందు కనిపిస్తున్నా వీరు డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ఉన్న క్రేజ్ చూసి భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. రామ్.. ఇస్మార్ట్ క్యారెక్టర్ కి ఉన్న క్రేజ్ చూసి ఈ చిత్రం మినిమం అయినా ఆడుతుందని అంతా భావించారు. కానీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఢమాల్ అంది. అందరు బయ్యర్ల కంటే ఎక్కువగా నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నష్టాల్లో కూరుకుపోయారు.
బయ్యర్లని ఆదుకునే విషయంలో పూరి జగన్నాధ్, ఛార్మి నీతులు మాత్రమే చెబుతారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నష్టాల నుంచి కాస్తయినా ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి, ఇతర బయ్యర్లు అడిగితే పూరి, ఛార్మి ఇచ్చిన సమాధానానికి వారి మైండ్ బ్లాక్ అయినట్లు తెలుస్తోంది.
Puri Jagannadh
భవిష్యత్తులో సినిమా చేసి తక్కువ ధరకి ఇస్తామని చెబుతున్నారట. ప్రస్తుతానికి డబ్బులు లేవు. కావాలంటే తమ పాత చిత్రాలు రీ రిలీజ్ చేసుకుని లాభం వస్తే సగం ఇవ్వండి అని తిరిగి బయ్యర్లనే పూరి, ఛార్మి అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అసలు రీరిలీజ్ చేస్తే ఆదాయం వస్తుందా ? మళ్ళీ అందులో సగం ఇవ్వాలా అంటూ నిరంజన్ రెడ్డితో పాటు ఇతర బయ్యర్లు షాక్ అయ్యారట. బయ్యర్లకి ఆదుకోకుండా పూరి, ఛార్మి కొత్త జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.