పూరి జగన్నాథ్ టైమ్ బాగోలేదు. ఎంతో నమ్మకం పెట్టి చేసిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఆ సినిమాని చాలా ప్రెజర్స్ మధ్య చేసి రిలీజ్ చేసారు. ఎంతలా అంటే మరో రెండు రోజుల్లో రిలీజ్ దాకా కూడా లైగర్ నష్టాల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. అసలు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా అన్న సందేహం డిస్ట్రిబ్యూటర్స్ లో వచ్చేసింది. లైగర్ నష్టపరిహారం విషయమై అప్పట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే సాఫీగా జరిగిపోయేది . కానీ ఆలా కాకుండా అనేక మెలికలు పెట్టి మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ ని భారీగా రిలీజ్ చేసారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
అయితే డబుల్ ఇస్మార్ట్ సైతం ..లైగర్ దారిలోనే ప్రయాణం పెట్టుకుంది. కలిసొచ్చిన సెలవులు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ 52 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎక్స్‌పెక్ట్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’, కేవలం 12 కోట్లకే పరిమితమవ్వడం దారుణమైన దెబ్బను మిగిల్చింది. దాంతో, మళ్లీ పూరీ జగన్నాధ్ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా నష్టపరిహారాలు సెటిల్ చేయాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. అందుతున్న సమాచారం మేరకు నిర్మాత, దర్శకుడు పూరి జగన్నాథ్ ...డబుల్ ఇస్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న నిరంజనరెడ్డికు నష్టపరిహారం ఇస్తానని చెప్పారట. కలెక్షన్స్, పేమెంట్స్ అన్ని లెక్కలు చూసుకుని పూరి జగన్నాథ్, నిరంజనరెడ్డి ఇద్దరూ మ్యూచివల్ ఎగ్రిమెంట్ కు వచ్చారట.
డిస్ట్రిబ్యూటర్ నిరంజనరెడ్డి కు ఇరవై కోట్ల రూపాయలు వెనక్కి ఇస్తానని పూరి జగన్నాథ్ చెప్పారట. అయితే అది క్యాష్ రూపంలోనా లేక పూరి జగన్నాథ్ ఓ మీడియం బడ్జెట్ సినిమా చేసి ఆ నిర్మాతకు ఇవ్వటమా అనేది ఇంకా తేలలేదట.
పూరి జగన్నాథ్ డైరక్ట్ చేస్తానంటే ఇప్పటికీ మీడియం రేంజి హీరోలు ఉత్సాహం చూపుతారు. అయితే పూరికి తమిళ,తెలుగులో ఓ సినిమా చెయ్యాలని ఉందిట. కానీ నిరంజనరెడ్డి మాత్రం హిందీ హీరోని తెచ్చి తెలుగు, హిందీలో మార్కెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే పూరి జగన్నాథ్ స్క్రిప్టు పూర్తి చేసారట.
డబుల్ ఇస్మార్ట్ మూవీ పైన జరిగిన థీయాట్రికల్ బిజినెస్ లో కనీసం 25 శాతం కూడా రికవరీ కాలేదని ట్రేడ్ లో లెక్కలు తేలింది. అయితే పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రం అన్ని భాషలకి సంబందించిన రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డికి ముందుగానే భారీ మొత్తానికి అమ్మేశారు.
ఈ విధంగా డబుల్ ఇస్మార్ట్ నష్టాల నుంచి వారు ముందుగానే సేఫ్ అనుకుంటే ఇప్పుడు రికవరీ లు అంటే కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిర్మాతగా హనుమాన్ సినిమాతో నిరంజన్ రెడ్డి భారీ లాభాలు సొంతం చేసుకున్నారు. హనుమాన్ తో వచ్చిన ప్రాఫిట్ ని డబుల్ ఇస్మార్ట్ మీద పెట్టుబడిగా పెట్టారంట. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ వాష్ అవుట్ అవ్వడంతో నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయారు.
రిలీజ్ సమయంలో రిస్క్ పడ్డా హనుమాన్ సూపర్ హిట్ తర్వాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ స్పీడ్ పెంచారు. ఆ తర్వాత కమిడియన్ ప్రియదర్శి హీరోగా డార్లింగ్ మూవీ వచ్చింది. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ చేశారు.
థీయాట్రికల్ గా ఈ సినిమా నష్టం వచ్చిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి రికవరీ అయిపొయింది. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా రైట్స్ ని కొనుగోలు చేస్తున్నప్పుడే నిరంజన్ రెడ్డి పెద్ద రిస్క్ చేసారు. అదే డిజాస్టర్ అయ్యింది.
లైగర్ నష్టాల నుంచే ఇంకా తేరుకోలేక పోతున్న పూరి జగన్నాధ్, డబుల్ ఇస్మార్ట్ నష్టాల నుంచి ఎలా బయట పడుతాడో చూడాలి. డబుల్ ఇస్మార్ట్ తో లైగర్ నష్టాలను పూడ్చాలని భావించిన పూరి ఇప్పుడు ఏం చేస్తాడా అంటూ ఆయన వైపు చూస్తున్నారు.
రామ్ కూడా మరో మంచి సినిమా కోసం అప్పుడే కథలు వినడం మొదలు పెట్టాడట. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే పూరి మాత్రం ఈ సినిమా రికవరీలు కట్టడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు.