యువతకి నచ్చే అంశాలని పూరి జగన్నాధ్ తన చిత్రాల్లో పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అందుకే పూరి చిత్రాలకి కొంచెం టాక్ అటు ఇటూగా ఉన్నా నిర్మాతలకు పెద్దగా నష్టం ఉండదు. ఇటీవల పూరి జగన్నాధ్ తన సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్నారు.వైష్ణో అకాడమీ, పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థల్ని పూరి స్థాపించిన సంగతి తెలిసిందే.