డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమా అంటే.. ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. వసూళ్లు పక్కా అన్నట్లుగా వ్యవహారం ఉండేది. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది.