`జబర్దస్త్` కమేడియన్‌కి కిడ్నీ దానం చేస్తానన్న అభిమాని.. ఫస్ట్ టైమ్‌ బాధపడుతున్నా అంటూ కన్నీళ్లు

Published : May 04, 2022, 04:08 PM ISTUpdated : May 04, 2022, 06:24 PM IST

`జబర్దస్త్`లో పంచ్‌ ప్రసాద్‌ ఎంతగా ఫేమస్సో తెలిసిందే. ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకు కిడ్నీ ఇచ్చేందుకు ఓ అభిమాని ముందుకు రావడం అందరిని కదిలిస్తుంది. దీనికి ప్రసాద్‌ రియాక్షన్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది.   

PREV
16
`జబర్దస్త్` కమేడియన్‌కి కిడ్నీ దానం చేస్తానన్న అభిమాని.. ఫస్ట్ టైమ్‌ బాధపడుతున్నా అంటూ కన్నీళ్లు

`జబర్దస్త్` షోలో నవ్వులు పంచే కమేడియన్ల జీవితాల వెనుక చాలా విషాద కథలున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది జబర్దస్త్ కమేడీయన్లు తమ బాధలను పంచుకున్నారు. తాము పంచే నవ్వుల వెనకాలున్న సాడ్ స్టోరీస్‌ని వెళ్లడించారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అందులో `పంచ్‌` ప్రసాద్‌ ది మరో కథ. అత్యంత భావోద్వేగపూరితమైన కథ. దాన్ని మరోసారి వెల్లడించారు. కన్నీళ్లు పెట్టించారు.

26

పంచ్‌ ప్రసాద్‌గా `జబర్దస్త్`లో నవ్వులు పూయిస్తున్నారు ప్రసాద్‌. చిన్న స్థాయి నుంచి మంచి స్థాయికి ఎదిగారు. అయితే ఆయన అనారోగ్య(కిడ్నీ) సమస్య కారణంగా చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆయన బతకడం కష్టమని డాక్టర్లే చెప్పారు. అలాంటి స్థితి నుంచి కోలుకుని ఇప్పుడు మళ్లీ `జబర్దస్త్`లో కమేడియన్‌గా రాణిస్తున్నారు. తన భార్య ఇచ్చిన సపోర్ట్ కారణంగా తాను బతికానని ఆ మధ్య షోలోనే చెప్పారు ప్రసాద్‌. భవిష్యత్‌లో తన భార్య తనకు ఓ కిడ్నీ దానం చేయబోతుందని వెల్లడించారు. 
 

36

తాజాగా పంచ్‌ ప్రసాద్‌ కోసం కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చాడో అభిమాని. నిజంగానే మీకు కిడ్నీ అవసరం ఉందంటే, కిడ్నీ ఇస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారంటే నేను కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమే అని ఓ అభిమాని వీడియో ద్వారా వెల్లడించారు. ఇది సుడిగాలి సుధీర్‌ హోస్ట్ గా రన్‌ అవుతున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో జరుగుతుండటం విశేషం. సుధీర్‌ యాంకర్‌గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ పంచ్‌ ప్రసాద్‌ పాల్గొంటున్నారు. చాలా వరకు `జబర్దస్త్` నటులంతా ఈ షోలో పాల్గొని తమదైన స్పెషల్‌ స్కిట్లతో అలరిస్తుంటారు. 

46

నెక్ట్స్ ఆదివారం ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో అభిమానులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి కమేడియన్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఓ అభిమాని వీడియో సందేశం పంపించారు. తాను కిడ్నీ దానం చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. `ప్రసాద్‌ అన్న మీకు నేను చాలా పెద్ద అభిమానిని. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ సమస్యని తలచుకుని ఎప్పుడైనా బాధపడ్డారా? మీకు నిజంగా అవసరం అయితే నా కిడ్నీ ఇవ్వడానికైనా నేను రెడీ అన్నా` అని తెలిపారు. 

56

దీనికి పంచ్‌ ప్రసాద్‌ చెబుతూ, తనకు కిడ్నీ సమస్య ఉందని ఏ రోజూ తలచుకుని బాధపడలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దీని గురించి ఆలోచించలేదు. కానీ ఫస్ట్ టైమ్‌ ఇప్పుడు బాధపడుతున్నా. నా కోసం కిడ్నీ ఇచ్చేంత అభిమానులున్నారా? అనిపిస్తుంది. ఈ సందర్భంగా దేవుడిని కోరుకునేది ఏంటంటే.. నాకు ఇంకొన్నాళ్లు మిమ్మల్ని నవ్వించే లైఫ్‌ స్పాన్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా` అని బరువెక్కిన హృదయంతో చెప్పారు ప్రసాద్‌. కన్నీళ్లు పెట్టుకున్నారు. 

66

ఇది చూసి సుడిగాలి సుధీర్‌, ఇంద్రజ, హైపర్‌ ఆది, ఇతర టీవీ ఆర్టిస్టులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. వచ్చే ఆదివారం ఈటీవీలో ఈ షో ప్రసారం కాబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories