పునర్నవి భూపాలం గురించి పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ 3లో పునర్నవి ప్రధాన కంటెస్టెంట్ గా రాణించింది. తన క్యూట్ లుక్స్ తో యువతని విపరీతంగా ఆకర్షించింది. ఉయ్యాల జంపాల చిత్రంలో పునర్నవి క్యారెక్టర్ రోల్ లో మెరిసి మెప్పించింది.
26
బిగ్ బాస్ 3 తర్వాత పునర్నవి సినిమాలు, వెబ్ సిరీస్ చేసింది. కానీ ఏవి వర్కౌట్ కాలేదు. దీనితో పునర్నవి లండన్ కి వెళ్ళిపోయింది. అంతకు ముందు పునర్నవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుండేది. ఇటీవల సైలెంట్ గా ఉంటోంది.
36
కానీ పునర్నవి గురించి రూమర్స్ ఆగడం లేదు. తాజాగా పునర్నవి గురించి షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఇటీవల పునర్నవి షేర్ చేసిన కొన్ని ఫొటోస్ లో ఆమె పొట్ట భాగం కాస్త బొద్దుగా కనిపిచింది. దీనితో పునర్నవి గర్భవతి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
46
పునర్నవి పెళ్లి కాకుండానే గర్భవతి అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరికొందరు ఇంకాస్త అసభ్యంగా.. పునర్నవి తన గే ఫ్రెండ్ వల్ల గర్భవతి ఐంది అంటూ జోరుగా ప్రచారం చేశారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. తన గురించి అసభ్యంగా వైరల్ అవుతున్న రూమర్స్ పై పునర్నవి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
56
నా గే బెస్టీతో ప్రెగ్నన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టప్రకారం వార్తలు రాశారు. ఇది నాన్ సెన్స్. ఇటీవల నాకు కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడు పరిస్థితి క్రిటికల్ గా ఉందని రాసేశారు. ఇప్పుడు నేను గర్భవతిని అంటూ అసత్యాలు వైరల్ చేస్తున్నారు.
66
సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలని ఎవరూ నమ్మకండి. ఇలాంటి వార్తలు వల్ల మనసుకి ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోండి అంటూ పునర్నవి పోస్ట్ పెట్టింది. పునర్నవి తన గే ఫ్రెండ్ తో ఉంటున్న ఫొటోస్ ని తరచుగా సోషల్ మేదియో షేర్ చేస్తూ ఉంటుంది.