ప్రెగ్నెన్సీ సమయంలో ప్రణీతా సుభాష్ అలా అయిపోయిందట.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

First Published | Feb 10, 2023, 6:11 PM IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) తాజాగా ఫ్యాన్స్ తో లైవ్ సెన్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చి ఆకట్టుకున్నారు. 
 

సౌత్ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ అందం, అభినయంలో ఎప్పుడో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సౌత్ హీరోయిన్లలో ఒకరైన ఈ బ్యూటీ కొద్ది కాలంగా పెళ్లి, ప్రెగ్నెన్సీతో కాస్తా సినిమాలకు దూరం అయ్యారు.

వ్యాపార వేత్త నితిన్ రాజుతో ప్రణీత సుభాష్ పెళ్లి 2021 మేలో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. చాలా సీక్రెట్ గానే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది. కొద్దిరోజులకు తన వెడ్డింగ్ పిక్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుని మ్యారేజ్ పూర్తైనట్టు తెలిపారు. 
 


ఇక గతేడాది ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. 2022 జూన్ 10న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగానూ ప్రమోట్ అయ్యారు. మొన్నటి వరకు భర్త, కూతురు, ఫ్యామిలీతో సంతోషంగా గడిపింది. 
 

ప్రస్తుతం మళ్లీ తనకేరీర్ పై ఫోకస్ పెట్టారు ప్రణీతా సుభాష్. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతున్నారు. ఫ్యాన్స్ తోనూ టచ్ లో ఉండేందుకు లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.తాజాగా ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో లైవ్ లో మీట్ అయ్యారు. 

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈక్రమంలో తను ప్రెగ్నెన్సీ సమయంలో చాలా లావైపోయాయనని తెలిపారు. తన ముక్కు, చెంపలు బాగా ముందుకు వచ్చాయని.. రిలేటీవ్స్ క్యూట్ గా ఉన్నావని అనేవారి.. కానీ తనకు మాత్రం అదోలా ఉండేదని తెలిపారు. 

డెలివరీ సమయంలోనే 75 కేజీల వరకు బరువు పెరిగిందంట. ఇక డెలివరీ తర్వాత.. తనకెంతో ఇష్టమైనా ఫూడ్స్ ను కూడా పక్కనపెట్టి వెయిట్ తగ్గించే పనిలో పడిందంట. ఇందుకోసం రోజూ వ్యాయమం, స్విమ్మింగ్ చేస్తూ మళ్లీ నార్మల్ గా అయ్యానంటూ వివరించారు. 
 

అందుకే అప్పట్లో సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోలు కూడా షేర్ చేయలేదని చెప్పొకొచ్చింది. ప్రస్తుతం తను సినిమాలపై ఫోకస్ పెట్టానన్నారు. ఇక తను స్మిమ్మింగ్ అంటే చాలా ఇష్టమని.. షూటింగ్ నుంచి రాత్రి 11 గంటలకు వచ్చినా పూల్ లోకి వెళ్తానని చెప్పారు. ఇలా ఫ్యాన్స్ తో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ప్రణీతా.
 

తల్లిగా ప్రమోషన్ పొందాక ప్రణీత మలయాళంలో తొలిచిత్రం చేస్తుంది. దిలీప్ కుమార్ 148 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది మలయాళంలో ప్రణీతకు డెమ్యూ మూవీ. దీంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రణీత నటించిన ‘రావణసుర’ షూటింగ్ దశలో ఉంది. 

Latest Videos

click me!