రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. తాజాగా పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.