`తమ్ముడు` సినిమాలో పవన్‌ చేసిన ఫైట్స్ డూపా?.. బాంబ్‌ పేల్చిన బాలయ్య.. పవర్‌స్టార్‌ ఏమన్నాడంటే?

Published : Feb 01, 2023, 07:28 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన చిత్రాల్లో `తమ్ముడు` ఓ క్లాసిక్‌. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ డూప్‌ లేకుండా రియల్‌గానే ఫైట్స్ చేశాడనే టాక్‌ ఉంది. కానీ అవన్నీ డూపంటగా అంటూ పెద్ద బాంబ్‌ పేల్చాడు బాలయ్య.   

PREV
15
`తమ్ముడు` సినిమాలో పవన్‌ చేసిన ఫైట్స్ డూపా?.. బాంబ్‌ పేల్చిన బాలయ్య.. పవర్‌స్టార్‌ ఏమన్నాడంటే?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీస్‌లో `తమ్ముడు` ఒకటి. `తొలిప్రేమ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆయనకు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్ గా నిలిచింది. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కి ఆకట్టుకుంది. పీ ఏ అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా ప్రీతి జాంగైని, అదితి గోవిట్రికర్‌ హీరోయిన్లుగా నటించారు. 
 

25

ఇందులో పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా యాక్షన్‌ చేశారనే పేరుంది. డూప్‌ లేకుండానే ఆయన ఫైట్స్ చేశాడని ఇప్పటికీ చర్చించుకుంటారు. కానీ అందులో నిజం లేదంటున్నారు బాలయ్య. అంతేకాదు అంతా డూపే అంటగా అంటూ పెద్ద బాంబ్‌ పేల్చాడు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ సంఘటన బాలయ్య హోస్ట్ గా చేసే `అన్‌ స్టాపబుల్‌ 2` షోలో చోటు చేసుకుంది. 
 

35

`అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` చివరి ఎపిసోడ్‌గా పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్న ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈచిత్రీకరణ జరగ్గా, మొదటి పార్ట్ ని రేపు రాత్రి నుంచి `ఆహా` ప్రసారం చేయబోతుంది. దీంతోవరుసగా గ్లింప్స్ లు మాదిరి వీడియో క్లిప్పులు విడుదల చేస్తూ ఆడియెన్స్ ని, అభిమానులను ఎంగేజ్‌ చేస్తున్నారు నిర్వాహకులు. తాజాగా `తమ్ముడు` సినిమాలోని ఫైట్స్ కి సంబంధించిన క్లిప్‌ని రిలీజ్‌ చేశారు. 
 

45

ఇందులో బాలయ్య మాట్లాడుతూ, `తమ్ముడు సినిమాలో ఫైట్స్ అన్ని డూప్‌ అంటగా` అంటూ షాకిచ్చాడు. దీనికి పవన్‌ ట్రూ, ఆర్‌, ఫాల్సా అనేది చెప్పాల్సి ఉంటుంది. బాలయ్య ప్రశ్నకి, పవన్‌ కూడా నిజమా అబద్దమా? అనేది తేల్చుకోలేకపోతున్నాడు. ఈ సందర్భంగా అసలు విషయం ఓపెన్‌ అయ్యాడు. నిజంగా ఓ స్తాంబాన్ని కొట్టాలి, కొడుతా ఉండట, చేతికి రక్తం కారుతుందట. షాట్‌ అయిపోయాక అడిగాను, ఎవడ్రా.. ఆర్ట్ డైరెక్టర్‌ ఎవడ్రా తీసుకురమ్మని చెప్పా. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

55

మొత్తానికి మంచి స్టఫ్‌ ఇచ్చాడు పవన్‌. ఈ వన్‌ మినిట్‌ ప్రోమోలో పవన్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ కనిపించడం విశేషం. పవన్‌ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌ని రెండు పార్ట్ లుగా ప్రసారం చేయనున్నారు. రేపు మొదటి పార్ట్ ని ప్రసారం చేయనున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories