బంపర్ ఆఫర్ కు నో చెబుతున్న శ్రీలీల, అల్లు అర్జున్ తో ఆఫర్ వదిలేసిన బ్యూటీ, కోట్లిచ్చిన చేయదట.. కారణం..?

Published : Mar 09, 2024, 07:15 PM ISTUpdated : Mar 09, 2024, 07:37 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల లిస్ట్ లో మారు మోగిపోతున్న పేరు శ్రీలీల. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ అందరిజోడీగా నటిస్తోంది బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చిందట నిర్మాతల నుంచి. ఇంతకీ ఏంటా ఆఫర్ తెలుసా..?  

PREV
15
బంపర్ ఆఫర్ కు నో చెబుతున్న శ్రీలీల, అల్లు అర్జున్ తో ఆఫర్ వదిలేసిన బ్యూటీ, కోట్లిచ్చిన చేయదట.. కారణం..?

టాలీవుడ్ లో చాలా తక్కువ టైంలో  హీరోయిన్ గా ఎదిగింది శ్రీలీల.. రవితేజ మహేష్ బాబు లాంటి సీనియర్ హీరోల తో పాటు.. రామ్, రోషన్  లాంటి యంగ్ స్టార్స్ సరసన కూడా నటించి మెప్పించింది బ్యూటీ.  వరుస సినిమాలతో.. తన డాన్స్ పెర్ఫామెనస్ తో పాటు.. నటనతో ఎక్కువ పాప్యులారిటీ సంపాదించుకున్న ఇటీవలి హీరోయిన్స్ లో శ్రీ లీల ఎక్కువ మార్కులే కొట్టేసింది. 
 

25
sreeleela

రవితేజతో చేసిన  ధమాకా సినిమా తర్వాత శ్రీలీల నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీలీల. ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. 

35

ఇదిలా ఉంటే శ్రీలీల రెండు క్రేజీ ఆఫర్స్ కు నో చెప్పిందట. అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2. స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలకు పెద్దమొత్తంలో ఆఫర్ చేశారట.. కానీ ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ కు నో చెప్పిందట. 
 

45

అలాగే మరో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఈ చిన్నదనికి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్ కు కూడా శ్రీలీల నో చెప్పిందట. ప్రస్తుతం కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండటంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడం కరెక్ట్ కాదు అని శ్రీలీల నో చెప్పిందట శ్రీలీల. 

55

పెళ్ళి సందడి చిత్రంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా పరిచయమైన ఈ అమ్మడు వచ్చిన ప్రతీ సినిమాని ఒప్పేసుకుని, ప్రతీ సినిమాలోనూ తనే అన్నట్టుగా అయి కూర్చుంది. 2017లో సప్తగిరి తో పాటు మొట్టమొదట తెలుగులో చిత్రాంగద సినిమాతో వచ్చినా పెళ్ళి సందడి చిత్రమే లీలకి తెలుగులో బ్రేక్ ఇచ్చింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories