కృతీ సనన్ ఆస్తి అన్ని కోట్లా..? బాలీవుడ్ సీత అంత సంపాదిస్తుందా..?

First Published | Mar 9, 2024, 5:38 PM IST

బాలీవుడ్ లో హీరోయిన్ గా దూసుకుపోతోంది కృతీ సనన్. పాన్ ఇండియా స్టార్ గా మారిన ఈ బ్యూటీ. భారీగా ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలస్తోంది. ఇంతకీ ఆమె ఆస్తులు.. ప్రతీ సినిమాకు ఆమె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కృతీ సనన్ కూడా ఒకరు.  ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో కృతి సనన్ కూడా ఉన్నారు. ఆమె తెరంగేట్రం చేసింది మాత్రం తెలుగు సినిమాతోనే.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈబ్యూటీ. కాని తెలుుగులో పెద్దగా కలిసి రాలేదు కృతీకి. 
 

తెలుగులో చేసిన రెండు మూడు సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో.. కృతీ  బాలీవుడ్‌ కు జంప్ అయ్యింది బీ టౌన్  కే పరిమితం అయింది. అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కృతీ సనన్. మంచి  స్థానం సంపాదించింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్.. ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ ప్రశంసలు అందుకుంది. 
 


హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత భారీగా సంపాదించుకున్నదట కృతీ సనన్. వరుస సినిమాలు, వ్యాపార ప్రకటనలతో పాటు.. పలు బిజినెస్ లలో కూడా ఆమె ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక  కొన్ని నివేదికల ప్రకారం కృతిసనన్ నికర ఆస్తుల విలువ 90 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. 
 

అంతే కాదు  2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్. సంవత్సరానికి 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది. ప్రతి సినిమాకు 5 నుంచి 6 కోట్లు వరకు వసూలు చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ. 
 

రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ జోడీగా నటించి మెప్పించింది కృతీ. ఈసినిమాకుగాను ఆమె 5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. మరికొన్ని వార్తల ప్రకారం ఆమె  ఆదిపురుష్ సినిమాకు ఈమె 3 కోట్లు తీసుకుందని టాక్. అలాగే షెహజాదా సినిమాకు 5 కోట్లు తీసుకుందట కృతి.
 

ఇక 1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అప్స్ అండ్ డౌన్స్‌ చూస్తూ..ఫిల్మ్ స్టార్ అయిపోయింది. 
 

Latest Videos

click me!