నేను కోరుకోలేదు, కానీ కఠిన నిర్ణయం తప్పలేదు.. ఇక జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు, సమంత కామెంట్స్

Published : Mar 09, 2024, 05:54 PM IST

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది.

PREV
16
నేను కోరుకోలేదు, కానీ కఠిన నిర్ణయం తప్పలేదు.. ఇక జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు, సమంత కామెంట్స్

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. 

26

ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.  దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. 

36

 అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమంత ఇప్పటికి తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేందుకు చికిత్స తీసుకుంటోంది. 

46
Samantha

సమంత క్రేజీ స్టార్..అది కూడా కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఏడాది బ్రేక్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో సమంత స్పందించింది. తాను కెరీర్ నుంచి ఏడాది బ్రేక్ తీసుకోవడం అంటే చాలా కఠిన నిర్ణయం అని సమంత తెలిపింది. 

 

56

కెరీర్ తో పోల్చితే ఆరోగ్యమే ముఖ్యం అని భావించా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇకపై జీవితంలో ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నా అంటూ సమంత పేర్కొంది. నేను బ్రేక్ తీసుకుంది సమయం వృధా చేయడానికి కాదు. నా ఆరోగ్యం కోసమే. దీని కోసం చాలా అవకాశాలు వదులుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ తప్పలేదు అని సమంత తెలిపింది. 

66
Samantha

ప్రస్తుతం సమంత రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలసి నటిస్తోంది. అది తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సమంత సైన్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. 

click me!

Recommended Stories