ప్రముఖ నిర్మాత నాగవంశీ సంచలన చిత్రం అబ్సెషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మూవీ టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉండడం వల్ల హిట్ కాలేదని, యువత ఎంజాయ్ చేసే శాడిజంతో కూడిన అంశాలు ఉన్నాయి అని అన్నారు.
ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించిన లేటెస్ట్ మూవీ లెనిన్. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కింది. జూలై 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాగవంశీ వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ లో జరిగే వివాదాలు, నిర్మాతల సమస్యలు, హీరోల రెమ్యునరేషన్ లాంటి అంశాలపై నాగవంశీ ఓపెన్ గా మాట్లాడుతుంటారు.
25
ప్రపంచాన్ని ఊపేసిన హారర్ చిత్రం
చాలా సందర్భాల్లో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతుంటాయి. తాజాగా నాగవంశీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఆబ్సెషన్ అనే చిత్రం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఒక ఊపు ఊపేసింది. హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ లాంటి ఓటీటీల్లో రెంట్ కి అందుబాటులో ఉంది.
35
వేలకోట్ల కలెక్షన్స్
అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2 వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అబ్సెషన్ చిత్రం ఎంతటి విధ్వంసం సృష్టించిందో అని. ఒక హారర్ మూవీ ఇంతలా ప్రభంజనం సృష్టించడడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుకున్న అసలైన కారణాన్ని నిర్మాత నాగవంశీ బయటపెట్టారు.
లెనిన్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో నాగవంశీకి అబ్సెషన్ గురించి ప్రశ్న ఎదురైంది. అబ్సెషన్ మూవీ చూశారా అని అడగగా చూశాను అని నాగవంశీ సమాధానం ఇచ్చారు. ఆ మూవీ గురించి నేను ఏమైనా మాట్లాడితే తిడతారు. నా ఒపీనియన్ ఎవరికీ నచ్చట్లేదు అని అన్నారు. అయినప్పటికీ నాగవంశీ అబ్సెషన్ మూవీ అంతటి సూపర్ హిట్ కావడానికి కారణం బయటపెట్టారు.
55
అమ్మాయి శాడిజం వల్లే అంత పెద్ద హిట్
సినిమా అద్భుతంగా ఉంది. టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ అందులో డౌట్ లేదు. కానీ ఒక ఆడపిల్ల చూపించే శాడిజంని ఎంజాయ్ చేయడానికి యువత మొత్తం థియేటర్లకు ఎగబడ్డారు. మన ఫ్రెండ్ ని అతడి గర్ల్ ఫ్రెండ్ హింసిస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో.. అదే ఈ చిత్రంలో కూడా చూపించారు. అదే విధంగా భయపెట్టే సీన్లు కూడా ఉన్నాయి అని నాగవంశీ తెలిపారు.