మా సినిమాలు చూడకండి, రివ్యూస్‌ రాయకండి.. నిర్మాత నాగవంశీ ఫైర్‌, టార్గెట్ `భారతీయుడు`?

Naga Vamsi: నాగవంశీ నిర్మించిన `మ్యాడ్‌ 2`సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆయన రివ్యూలపై, సోషల్‌ మీడియాలో పెట్టే నెగటివ్‌ పోస్ట్ లపై ఫైర్‌ అయ్యారు. 

naga vamsi

Naga Vamsi: స్టార్‌ ప్రొడ్యూసర్‌ సూర్యదేవర నాగవంశీ ఫైర్‌ అయ్యారు. ఆయన నిర్మించిన `మ్యాడ్‌ స్వ్కేర్‌` మూవీ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే సుమారు రూ.70కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ ప్రకటించింది.

ఈ క్రమంలో తాజాగా నిర్మాత నాగవంశీ మంగళవారం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. `మ్యాడ్‌ 2` సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని, ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతుందని తెలిపారు. 

ఈ సందర్భంగా నిర్మాత కొన్ని వెబ్‌ సైట్స్ పై ఫైర్‌ అయ్యారు. కొందరు కావాలని తమ సినిమాపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూసి రివ్యూ రాశారు, వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను.

కానీ కొందరు నెగటివ్‌ రివ్యూ రాయడం మాత్రమే కాదు, దాన్ని నిజం చేసుకునేందుకు ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలో పదే పదే నెగటివ్‌గా పోస్ట్ లు  పెడుతున్నారని, సినిమాలో కథ లేదని, కానీ ఏదో ఆడుతుందని పోస్ట్ లు పెడుతున్నారని, పనిగట్టుకుని నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని నాగవంశీ ఫైర్‌ అయ్యారు. 
 


naga vamsi

వెబ్‌ సైట్‌ వాళ్లు తన సినిమాలు చూడకండి అని, రివ్యూలు రాయకండి అని, తన సినిమాలను కవర్‌ చేయకండి అంటూ ఆయన మండిపడ్డారు. మీడియా చాలా వరకు ఇండస్ట్రీపై ఆధారపడి ఉందని, కానీ మమ్మల్నే(నిర్మాతలను) టార్గెట్‌ చేస్తున్నారని అన్నారు.

మా సినిమాలు గురించి రాయకపోతే, ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే, యాడ్స్ ఇవ్వకపోతే మీడియా సంస్థలు ఎలా సర్వైవ్‌ అవుతాయని ఆయన ప్రశ్నించారు. ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ వెళ్లాలి అన్నారు. 
 

naga vamsi

ఈ సందర్భంగా భారతీయుడు 2 అంటూ ఓ జర్నలిస్ట్ గురించి చెబుతూ ఆయనపై విమర్శలు చేశారు. ఆయన ఏది నచ్చలేదో, సినిమాలో ఏ సన్నివేశం నచ్చలేదో కూడా వివరించి చెప్పాడని, పాటలు ఇంకా బాగా ఉండాల్సిందని కామెంట్‌ చేస్తున్నాడని,

ఆయనకు చిలిపి తనం ఎక్కువ. అందుకే `దబిడి దిబిడి` లాంటి పాటలను కోరుకుంటున్నాడని ఫైర్‌ అయ్యారు. రిలీజ్‌ ముందు కొన్ని కొన్ని ప్రమోషన్స్ చేయాల్సి వస్తుందని, తప్పడం లేదన్నారు. అది ఎవరైనా చేయాల్సిందే అన్నారు. 
 

Mad Square movie review, mad 2 review

కంటెంట్‌ నచ్చకపోతే ఎన్ని ఇంటర్వ్యూలిచ్చినా సినిమా ఆడదు, కంటెంట్‌ బాగుంటే, ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా సినిమా ఆడుతుందన్నారు. `మ్యాడ్‌ 2`లోనూ కథ లేదని తానే చెప్పానని, కానీ ఫన్‌, కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యిందని, ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్ ఇచ్చారని,

నాలుగు రోజుల్లోనే సినిమా దాదాపు అన్ని చోట్ల బ్రేక్‌ ఇవెన్‌ అయ్యిందని, ఒక రెండు మూడు ఏరియాల్లోనే 90శాతం వరకు కలెక్షన్లు రికవరీ అయ్యిందని, ఒక రెండు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందన్నారు నాగవంశీ. సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `మ్యాడ్‌ 2` చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 28న విడుదలైన విషయం తెలిసిందే. 

read  more: చెప్పు తెగుద్ది.. రమ్మంటూ సైగ చేసిన జబర్దస్త్ కమెడియన్‌కి యాంకర్‌ రష్మి మాస్‌ వార్నింగ్‌

also read: ఇంటి పేరు ఏంటి ? కూతుర్ని ప్రశ్నించిన చిరంజీవి..తన స్టైల్ లో గేమ్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి

Latest Videos

click me!