ఇంటి పేరు ఏంటి ? కూతుర్ని ప్రశ్నించిన చిరంజీవి..తన స్టైల్ లో గేమ్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఉగాది పర్వదినం సందర్భంగా మెగా 157 చిత్రం ప్రారంభం అయింది. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు.

Chiranjeevi asks her daughter sushmita about surname in telugu dtr
Chiranjeevi daughter Sushmita Konidela

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఉగాది పర్వదినం సందర్భంగా మెగా 157 చిత్రం ప్రారంభం అయింది. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. విక్టరీ వెంకటేష్, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు అతిథులుగా హాజరయ్యారు. ఓటీటీ హవా పెరిగాక థియేటర్లకు జనాలని రప్పించడం కూడా దర్శక నిర్మాతలకు టాస్క్ లాగా మారిపోయింది. 

Chiranjeevi asks her daughter sushmita about surname in telugu dtr
Mega 157

మంచి చిత్రాన్ని తెరకెక్కించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రేక్షకుల్లో బజ్ పెంచేలా, థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూడాలి అనే ఆసక్తిని పెంచేలా ప్రచార కార్యక్రమాలు కూడా చేయాలి. సినిమాలు బాగా తీసే దర్శకులు ఉన్నారు కానీ, ప్రమోషన్స్ ని కూడా ముందుండి నడిపించే డైరెక్టర్ తక్కువ. ప్రమోషన్స్ కూడా చక్కగా ప్లాన్ చేసే దర్శకుల విషయానికి వస్తే రాజమౌళి, అనిల్ రావిపూడి పేర్లు ప్రధానంగా ప్రస్తావించాలి. 


Mega 157

సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విషయంలో అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ అద్భుతం అనే చెప్పాలి. ఒకవైపు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లాంటి మాస్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేసి జనాల్లో ఆసక్తి పెంచారు. ఫలితంగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలని మించే విధంగా సంక్రాంతికి వస్తున్నాం భారీ వసూళ్లు సాధించి విన్నర్ గా నిలిచింది. 

Mega 157

ఇప్పుడు చిరంజీవి మెగా 157 చిత్రం విషయంలో లాంచ్ ఈవెంట్ నుంచే అనిల్ రావిపూడి తన గేమ్ మొదలు పెట్టారు. ఒక ఫన్నీ వీడియో రిలీజ్ చేసి చిరంజీవికి తన టీం మొత్తాన్ని చిరంజీవికి పరిచయం చేసిన విధానం అదిరిపోయింది. చిరంజీవి చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర ఇంకా కొన్ని సూపర్ హిట్ చిత్రాల కటౌట్స్ ఉంటాయి. ఒక్కో  కటౌట్ దగ్గర ఒక్కో డిపార్ట్మెంట్ ఉంటారు. ముందుగా చూడాలని ఉంది కటౌట్ తో మొదలవుతుంది. చిరంజీవి ఎంట్రీ ఇవ్వగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారంతా అన్నయ్య మిమల్ని మంచి కామెడీ టైమింగ్ లో చూడాలని ఉంది అని అంటారు. తప్పకుండా చూస్తారు అని చిరు హామీ ఇస్తారు. 

Mega 157

ఇలా ముందుకెళ్లే కొద్దీ సంగీత దర్శకుడు భీమ్స్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ ఇలా ఒక్కొక్కరూ తమని తాము చిరంజీవికి పరిచయం చేసుకుంటారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ కటౌట్ వద్ద నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఇద్దరూ ఉంటారు. ఇన్ ఫ్రెంట్ దేర్ ఈజ్ బ్లాక్ బస్టర్ ఫెస్టివల్ అని సుస్మిత డైలాగ్ చెబుతుంది. నా పేరు సుస్మిత కొణిదెల.. ఈ చిత్రానికి నిర్మాతని అని చిరంజీవికి పరిచయం చేసుకుంటుంది. ఇంటిపేరు ఏమన్నావ్ అని చిరంజీవి తిరిగి ప్రశ్నించగా కొణిదెల అని ఆమె సమాధానం ఇస్తుంది. చిరు వెంటనే ఆ పేరు నిలబెట్టాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Mega 157

చివర్లో గ్యాంగ్ లీడర్ కటౌట్ వద్ద డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉంటారు. ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ వి నువ్వే కదా అని చిరంజీవి సరదాగా అన్నారు. వచ్చే సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తున్నావ్ అని చిరంజీవి అడగగా.. మనం బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేద్దాం సార్ అని అనిల్ అన్నారు. ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. 

వీడియో ఇక్కడ చూడండి 

Latest Videos

vuukle one pixel image
click me!