బిజినెస్ విషయానికి వస్తే...పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా . తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపుగా రూ.127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.44 కోట్ల బిజినెస్ చేసింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో నైజాం ఏరియాలో అతి పెద్ద బిజినెస్ ఇదేగా చెప్పుకోవచ్చు.
సీడెడ్‌లో ఈ సినిమాకు రూ.24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రముఖ నిర్మాత ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులు దక్కించుకున్నారు. ఉత్తరాంధ్రలో రూ.15 కోట్లు, గుంటూరులో రూ.11 కోట్లు, ఈస్ట్ రూ.10.5 కోట్లు, వెస్ట్ రూ.9 కోట్లు, కృష్ణ 8.5 కోట్లు, నెల్లూరు రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది.