నిర్మాత చిట్టిబాబు లావణ్య త్రిపాఠి మెగా కోడలు కావడం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. లావణ్యను కోడలిగా తెచ్చుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠిని నాగబాబు కోడలిగా చేసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని నిర్మాత చిట్టిబాబు అన్నారు. లావణ్య ఆస్తిపరురాలు, మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి కాబట్టే ఇది సాధ్యమైంది అన్నట్లు ఆయన మాట్లాడారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టిబాబు ప్రణాళిక ప్రకారమే లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా వచ్చింది అన్నట్లు మాట్లాడారు.
26
చిట్టిబాబు మాట్లాడుతూ... లావణ్య రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. బాగా ఆస్తిపరురాలు. కోట్ల ఆస్తులు ఉన్నాయి. వరుణ్ లవ్ లో కూడా ఎవరూ అడ్డుపడటానికి వీలు లేకుండా లవ్ చేశాడు. చాలా తెలివిగా లవ్ ట్రాక్ బాగా నడిపాడు. అమ్మాయి బాగుంది. ఆమె నేపథ్యం బాగుంది. అంతకంటే ఇంకేం కావాలి. ఇక భాషా బేధాలు, కుల మత పట్టింపులు ఎప్పుడో పోయాయి... అన్నారు.
36
చిట్టిబాబు మాటలు పరిశీలిస్తే లావణ్యకు కోట్ల ఆస్తి ఉంది. గొప్పింటి అమ్మాయి, అందుకే ప్రేమలోకి దింపారు. కోడలిగా తెచ్చుకున్నారన్నట్లుగా ఉంది. చిట్టిబాబు వ్యాఖ్యలపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఇందులో పెడర్థాలు వెతకాల్సిన పనిలేదని అన్నారు.
46
Varun Tej - Lavanya Tripathi engagement
అలాగే నిహారిక భర్తకు దూరంగా ఉండటం మీద కూడా ఆయన స్పందించారు. నేను ఆడపిల్లల తండ్రిని. ప్రతి ఆడపిల్ల అత్తారింటిలో బాగుండాలని కోరుకుంటాము. నిహారిక గురించి నేను మాట్లాడను. ఆమె జీవితం బాగుండాలని మనం కోరుకుందాము. కొడుక్కి సమస్య వచ్చినా వాడు ఫైట్ చేస్తాడులే అనుకుంటాం, అదే అమ్మాయి సమస్య వస్తే తట్టుకోలేమని చిట్టిబాబు అన్నారు.
56
Photo Courtesy: Instagram
నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక జరిగింది. సాయంత్రం 7-8 గంటల మధ్య వరుణ్-లావణ్య ఉంగరాలు ఒకరికొకరు ధరింపజేసి నిశ్చితార్థం పూర్తి చేశారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తో పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి వేడుకకు వచ్చారు.
66
Varun Tej- Lavanya Tripathi
గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అధికారికంగా ప్రకటించారు. జూన్ 9న నిశ్చితార్థ వేడుక నిర్వహించారు.