మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణపై ప్రముఖ నిర్మాత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో బాలకృష్ణే నెంబర్ 1 అని కామెంట్స్ చేశారు. ఆయన అలా ఎందుకు అన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నెంబర్ 1 హీరోగా చిరంజీవి ఎన్నో సంచలనాలు సృష్టించారు. అనితర సాధ్యమైన రికార్డులు అందుకున్నారు. ఇప్పటికీ 7 ఏదుల వయసులో కూడా చిరు చురుకుగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. బాలయ్య కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
25
నిర్మాత సి. కళ్యాణ్ కామెంట్స్
ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ, చిరంజీవిలని పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా ఉన్నాయి. ఆయనేమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో నా ఓటు బాలయ్యకే. నేను ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడాలి అని అనుకుంటా. బాలయ్యలో ఉండే లక్షణం కూడా అదే.
35
చిరంజీవి అందరిముందు బయటపడరు
ఏదైనా కానీ నిజాయతీగా నిర్మొహమాటంగా స్పాట్ లోనే బాలయ్య రియాక్ట్ అవుతారు. చిరంజీవి గారిని నేను బాస్ అని పిలుస్తా. ఏదైనా ఇష్యూ వస్తే చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అవ్వరు. అందరి ముందు కోపాన్ని, బాధని చిరంజీవి బయట పెట్టరు. అందరి ముందు బయటపడకూడదు అని అనుకుంటారు. వేరే వాళ్ళ చేత చెప్పిస్తారు. ఒక సమస్య వస్తే కోపం అయినా, బాధ అయినా బాలయ్య వెంటనే రియాక్ట్ అవుతారు. దానిని అక్కడితో క్లోజ్ చేస్తారు. నేను కోరుకునేది అదే. కానీ చిరంజీవి గారు అలా కాదు.
సినిమాలు హిట్లు, ఫ్లాపులు, కెరీర్ గ్రాఫ్ ఇవన్నీకాదు.. బాలకృష్ణే నా దృష్టిలో నెంబర్ 1. చిరంజీవి గారితో సినిమా చేయాలని అడిగా. బాస్ మీరు మాకు డేట్లు ఎందుకు ఇస్తారులే బాస్ అని అంటుంటా. ఆయన నవ్వేసి ఊరుకుంటారు. కళ్యాణ్ మనం సినిమా చేయాలి అని చిరంజీవి గారు ఎప్పుడూ అనలేదు. కానీ రాంచరణ్ గారు అన్నారు. సార్ మనం కలసి ఒక సినిమా చేయాలి సార్ అని చరణ్ నాతో అన్నాడు.
55
అల్లు అరవింద్ కి రుణపడి ఉంటా
మెగా ఫ్యామిలీలో నా మంచి కోరుకునే వ్యక్తి అల్లు అరవింద్ గారు అని సి కళ్యాణ్ తెలిపారు. నేను ఎదగాలని అరవింద్ గారు ఎప్పుడూ కోరుకుంటారు. మెగా ఫ్యామిలీలో మాత్రమే కాలేదు మొత్తం ఇండస్ట్రీలో నేను మొదట గౌరవం ఇచ్చే వ్యక్తి అరవింద్ గారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు వీడికి ఇలాగే కావాలి అని జోకులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అరవింద్ గారు నా మంచే కోరుకున్నారు. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటా అని సి కళ్యాణ్ తెలిపారు.