అఖిల్ కు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారే, ఆ గొడవ ఇప్పుడెందుకు?..

First Published Apr 10, 2024, 2:51 PM IST

అఖిల్ కు అసలే గత  కొంతకాలంగా హిట్ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. ఆ గాయం మర్చిపోతున్న సమయంలో ...

కొందరు అదే పనిగా హీరోలును కెలికే పోగ్రామ్ పెట్టుకుంటారు. అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ (Akhil) నటించిన చిత్రం ‘ఏజెంట్‌’(Agent). ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా ఇది ఓటీటీలోకి రాకపోవడంతో కొందరు నెటిజన్లు మూవీ టీమ్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే నిజంగా అభిమానులు అయితే అప్పుడే థియేటర్ లో చూసి ఉండేవారు కదా..ఇప్పుడు పనిగట్టుకుని ఓటిటిలో సినిమా చూడాలనే ఆత్రుత ఏమిటనేది క్వచ్చిన్?కావాలని కెలకటమే కదా అని కొందరంటున్నారు సోషల్ మీడియా సాక్షిగా.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్ వచ్చిన 'ఏజెంట్' #Agent సినిమా విడుదలయి నెలలు దాటింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పొందిన ఘోర పరాజయాన్ని ఎవరూ మర్చిపోలేదు. అదే సమయంలో ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తుందో చూద్దామనే ఆలోచన పోలేదు.రిలీజ్ అయిన మూడు వారాలకే అంటే అప్పట్లో లాస్ట్ ఇయిర్ మే 19   ఈ సినిమా ఓటిటి లో వచ్చేస్తోంది అని సోనీ లివ్ (SonyLiv)మొదట్లోనే ప్రకటించింది. కానీ ఇన్నాళ్లుదాకా ఈ సినిమా ఓటిటి లో రాలేదు.  

 మీడియాలో ఏజెంట్ మూవీ ఓటీటీలోకి రాదా? ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు ఈ సినిమా రాలేదు?  అనే రచ్చ మొదలైంది. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ..మళ్లీ ఎడిటింగ్ చేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారంటూ ప్రచారం మొదలెట్టారు. దాంతో ఓటీటీలో ఏజెంట్ ను కొత్తగా చూడొచ్చని సంబర పడ్డారు అక్కినేని ఫ్యాన్స్. కానీ అలాంటిదేమీ జరగటం లేదని తేలిపోయింది. స్వయంగా నిర్మాత అనీల్ సుంక రీ-ఎడిట్ లాంటివేం జరగడం లేదని స్పష్టంచేశారు.  అయినా ఇప్పటికీ ఈ రచ్చ తగ్గలేదు.

తాజాగా ఈ చిత్ర నిర్మాత దీనిపై స్పందించారు. అనిల్‌ సుంకర తాజాగా ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై కామెంట్స్‌ చేశారు. ‘ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్‌ కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈవిషయాన్ని చాలాసార్లు చెప్పాను. అతి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది’ అని తెలిపారు. అయితే నిర్మాత మాత్రం రైట్స్ అమ్మేసిన సినిమా గురించి ఎంత సేపు అని మాట్లాడగలరు.

  ఈ మధ్యకాలంలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. ఏదన్నా సినిమా ఫెయిలై ఓటిటిలో వచ్చాక మళ్లీ వార్తల్లోకి వస్తోంది. థియేటర్ లో చూడని చాలా మంది ఓటిటిలో చూసి కామెంట్స్ మొదలెడుతున్నారు. మొన్నమధ్యా భోళా శంకర్ చిత్రానికి అదే జరిగింది. ఇప్పుడు ఏజెంట్ కు సైతం అదే రిజల్ట్ రాబోతోందా అని ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అందరూ ఆ సినిమాని మర్చిపోతున్న టైమ్ లో ఓటిటిలో వచ్చి మళ్లీ గుర్తు చేయటం మానుతున్న గాయాన్ని పనిగట్టుకుని కెలకటమే. సినిమా ఇలా ఉందేంటి..డైరక్షన్ ఇలా చేసారంటే ,అఖిల్ పాత్ర సరిగ్గా లేదు లేదా నటించలేదు ఇలా నోటికొచ్చిన కామెంట్స్ మళ్లీ మొదలవుతాయి.

 ఈ సినిమా విడుదల అయినా తరువాత పెద్ద వివాదమే అయింది. ముందు ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి అందులో ఈ సినిమా వైఫల్యానికి కారణం బౌండ్ స్క్రిప్ట్ లేకపోవటమే అన్నాడు. అలాగే భాద్యత అంతా తన మీదే వేసుకున్నాడు కూడా. అతను దర్శకుడు సురేందర్ రెడ్డి (SurenderReddy) ప్రస్తావన తేలేదు. కొన్ని రోజుల తరువాత అఖిల్ అక్కినేని #AkhilAkkineni కూడా ఒక నోట్ పెట్టాడు. 

అందులో తాను ఎంతో కష్టపడి చేశాను అని, అలాగే చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని చెపుతూ అందరికీ థాంక్స్ చెప్పాడు. అలాగే మళ్ళీ స్ట్రాంగ్ గా ఇంకో సినిమాతో వస్తాను అన్నాడు. కానీ అఖిల్ కూడా సురేందర్ రెడ్డి గురించి ప్రస్తావించలేదు. ఈ సినిమాలో సాక్షి వైద్య (SakshiVaidya)  హీరోయిన్ గా ఆరంగేట్రం చేసింది.

agent Telugu movie

దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో.. చాలా థియేటర్స్ నుండి ఈ సినిమాని తీసేసి... ఆ ప్లేస్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష మూవీని ప్రదర్శించారు. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఇలా అనూహ్యంగా డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకోవడం తట్టుకోలేకపోతున్నారు. చాలా రోజుల నుండి ఓ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. రిజల్ట్ తారుమారయ్యింది.  

  ఈ చిత్రం తర్వాత అఖిల్‌ అధికారికంగా ఏ ప్రాజెక్టునూ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తారో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామితో కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్‌.. ఇప్పటికే లింగుస్వామి కథకు ఓకే చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఇది పట్టాలెక్కనుందని అంటున్నారు. 

  కొత్త దర్శకుడితో  అఖిల్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో రూపొందనున్నట్టు సమాచారం. అనిల్‌ కుమార్‌ అనే ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘ధీర’ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. ఫాంటసీ కథతో రూపొందనున్నట్లు టాక్‌. 
 

click me!