కృష్ణంరాజు, శ్యామలా దేవి అరుదైన పెళ్లి ఫోటోలు.. రెబల్‌ స్టార్‌ సెకండ్‌ మ్యారేజ్‌ వెనుకున్న కథేంటో తెలుసా?

Published : Apr 10, 2024, 11:59 AM IST

కృష్ణంరాజు, శ్యామలా దేవిలది రెండో పెళ్లి. తాజాగా వీరి మ్యారేజ్‌కి సంబంధించిన అరుదైన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
110
కృష్ణంరాజు, శ్యామలా దేవి అరుదైన పెళ్లి ఫోటోలు.. రెబల్‌ స్టార్‌ సెకండ్‌ మ్యారేజ్‌ వెనుకున్న కథేంటో తెలుసా?

కృష్ణంరాజు టాలీవుడ్‌లో రెబల్‌ స్టార్‌గా ఎదిగాడు. అగ్రెసివ్‌ పాత్రలతో మెప్పించిన ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. స్టార్‌ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్, ఎస్వీఆర్‌ వంటి మొదటి తరం హీరోల తర్వాత కృష్ణ, శోభన్‌బాబు తరం హీరోలతో పోటీగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు కృష్ణంరాజు. రెబల్‌ స్టార్‌గా ఆయన ఎదిగారు. 

210

కృష్ణంరాజు రెండేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం చిత్ర పరిశ్రమని తీవ్రంగా కలచివేసింది. ప్రభాస్‌ చాలా కుంగిపోయాడు. పెదనాన్న అంటే ఆయనకు అంతటి ప్రేమ. దీంతో చాలా రోజులు ఆయన ఆ బాధలో ఉండిపోయాడు. ఇప్పుడు కృష్ణంరాజు మన మధ్య లేకపోయినా, ఆయన మరణించిన భావన ఎక్కడా కలగదు. సినిమాల ద్వారా, ఆయనపై చర్చ ద్వారా మన మధ్యనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. 

310

ఇదిలా ఉంటే కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట యంగ్‌ ఏజ్‌లోనే ఆయనకు సితాదేవితో మ్యారేజ్‌ అయ్యింది. చాలా కాలం వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. భార్య అంటే కృష్ణంరాజుకి అంతటి ప్రేమ. కానీ ఆమె అనూహ్యంగా యాక్సిడెంట్స్ లో కన్నుమూసింది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన రెబల్‌ స్టార్‌.. కొంత కాలం తర్వాత పెద్ద ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు. 
 

410

1996లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. ఆమె ఆయనకు అభిమాని. ఆయన సినిమాలంటే ఇష్టపడేది. ఆయనతో పెళ్లి అంటే భయంతోపాటు ఎగ్జైట్‌ అయ్యింది. అయితే కృష్ణంరాజుది రాజుల ఫ్యామిలీ. రాయల్‌ ఫ్యామిలీ. వచ్చేవారు, పోయే వారి తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంత మందిని తాను మెయింటేన్‌ చేయగలనా, తాను బాగా చూసుకోగలనా అనే అనుమానం ఉండేదట. కానీ ధైర్యం చేసుకుని ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ తో కృష్ణంరాజుని పెళ్లి చేసుకుంది శ్యామలాదేవి. 
 

510

అయితే కృష్ణంరాజుకి మాత్రం రెండో పెళ్లి ఇష్టం లేదు. తన మొదటి భార్యని కోల్పోయిన బాధలో ఆయన ఉన్నాడు. అందుకే నో చెప్పాడట. కానీ వాళ్ల నాన్న, బంధువుల పట్టుబట్టి శ్యామలాదేవితో పెళ్లి చేశారు. మొదట్లో కాస్త అటుఇటుగా ఉన్నా, ఆ తర్వాత శ్యామలాదేవిని ఎంతగానో ప్రేమించాడు కృష్ణంరాజు. ఆయన ఎక్కడికి బయటకు వచ్చినా, ఇద్దరు కలిసే వస్తారు. అలా అన్యోన్య జంటగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పటికీ అదే ఇమేజ్‌ ఉంది. 

610

తాజాగా కృష్ణంరాజు, శ్యామలాదేవి అరుదైన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లినాటి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్టార్‌ హీరోగా రాణించే టైమ్‌లో కూడా కృష్ణంరాజు ఎంత సింపుల్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారో అనేదానికి ఈ ఫోటోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

710

పెళ్లి సమయంలో శ్యామలాదేవి చాలా చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. చాలా ఇన్నోసెంట్‌గానూ ఉంది. పెళ్లి పీఠలపై ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగినట్టు ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. 

810

కృష్ణంరాజు మొదటి భార్యకి పిల్లలు లేరు. దీంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. పేరు ప్రశాంతి. ఆ తర్వాత శ్యామలాదేవితో ముగ్గురు అమ్మాయిలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిలకు జన్మనిచ్చారు. సాయి ప్రసీద నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు స్థాపించిన గోపీకృష్ణ బ్యానర్‌కి ఆమెనేనిర్మాతగా మారారు. `రాధేశ్యామ్‌` సినిమాని నిర్మించారు. 
 

910

ఇక కృష్ణంరాజుతో పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్యామలాదేవి. తమ పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని తెలిపింది. అమ్మాయి(శ్యామలాదేవి)ని చూడ్డానికి తన కజిన్‌ ని పంపించాడట కృష్ణంరాజు. ఆ సమయంలో శ్యామలాదేవి చిన్నపిల్లలతో ఆడుకుంటుందట. ఆ విషయం చెప్పగానే ఇంప్రెస్‌ అయిన కృష్ణంరాజు వెంటనే ఓకే చెప్పాడట. గొప్ప మనస్థత్వం ఉంటేనే అలా చిన్న పిల్లలతో ఆడుకుంటారని ఆయన చెప్పి, అమ్మాయిని చూడకుండానే మ్యారేజ్‌కి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని శ్యామలాదేవి ఓ ఇంటర్వూలో తెలిపింది.
 

1010

కృష్ణంరాజు, శ్యామలాదేవి ప్రేమకి, అన్యోన్య దంపత్యానికి గుర్తుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. తాము ఇద్దరు వేరు కాదని, ఎప్పుడూ కలిసే ఉంటామనే అర్థంలో దీన్ని నిర్మించినట్టు సమాచారం. కృష్ణంరాజు చివరగా `రాధేశ్యామ్‌` చిత్రంలో జ్యోతిష్యుడిగా కనిపించిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories