Priyanka Mohan Role In ET : ‘ఈటీ’లో ప్రియాంక మోహన్ పాత్ర ఇదేనట.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్..

Published : Mar 09, 2022, 11:02 AM ISTUpdated : Mar 09, 2022, 11:03 AM IST

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan).. విభిన్న పాత్రల్లో నటిస్తోంది. తను తాజాగా నటించిన చిత్రం ‘ఈటీ’. ఈ మూవీలో తన పాత్రపై పలు ఆసక్తికర విషయాలను తెలిపింది ప్రియాంక.  

PREV
16
Priyanka Mohan Role In ET : ‘ఈటీ’లో  ప్రియాంక మోహన్ పాత్ర ఇదేనట.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్..

తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) తన కేరీర్ ను 2019లో స్టార్ చేసింది. కన్నడ డెబ్యూ ఫిల్మ్ ‘ఓంధ్ కథే హెల్లా’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం తర్వాత తన అందం, అభినయానికి తెలుగులో ఆఫర్లను అందుకుంది. 
 

26

నేచురల్ స్టార్ నాని ( Nani) నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక. ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన పొంది.. బాక్సాఫీస్ వద్ద మధ్యస్తంగా విజయవంతమైంది. ఆ తర్వాత శర్వానంద్ నటించి ‘శ్రీకారం’ మూవీలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  
 

36

నాని గ్యాంగ్ స్టార్, శర్వానంద్ శ్రీకారం.. రెండు సినిమాల్లోనే నటించినా ప్రియాంకకు మాత్రం తెలుగులో కొంత గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం తమిళంలోనే వరుస సినిమాలు చేస్తోంది. చివరిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘డాక్టర్’ మూవీలో హీరో శివ కార్తీకేయ సరసన నటించింది. 
 

46

అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ కావడంతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది ప్రియాంక. తాజాగా సూర్య (Surya) నటించిన ఈటీ (ET) సినిమాలో నటించింది. ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రేపు (మార్చి 10న) రిలీజ్ కానుంది. 
 

56

అయితే ప్రస్తుతం ప్రియాంక మోహన్ తన ఆశలన్నీ ‘ఈటీ’పైనే పెట్టుకుంది. పక్కాగా మెప్పిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఈటీ మూవీపై మాట్లాడారు. మూవీలో రెండు షేడ్స్ లో కనిపించనుందట. ప్రధానంగా మహిళల అంశాలతో కూడిన చిత్రం కావడంతో తన పాత్రపై మరింత బాధ్యత ఉంటుందని తెలిపింది. ఫస్ట్ హాఫ్ లో హ్యాపీ మూడ్ లో కనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అగ్రెసివ్ గా, సిరియస్ గా కనిపించనుందని తెలిపింది. తన పాత్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు.  
 

66

ఆకాశమే నీ హద్దురా.. జై భీమ్ వంటి చిత్రాలతో విజయ పతాకం ఎగరేస్తున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘ఈటీ’ కోసం ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ టాక్ నడుస్తోంది. దీంతో ఫూచర్ లో ప్రియాంక మోహన్ కేరీర్ మరింత మెరుగయ్యే అవకాశం ఉండనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories