దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 'మేడ్ ఇన్ కొరియా' నటి, పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'మేడ్ ఇన్ కొరియా' అనే సౌత్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హృదయానికి హత్తుకునే కథ, విభిన్న సంస్కృతుల నేపథ్యంతో ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు రాష్ట్రపతి భవన్ నుంచి స్పెషల్ విందుకు ఆహ్వానం అందింది.
27
మేడ్ ఇన్ కొరియా మూవీ టీమ్ కు ఆహ్వానం..
ఏప్రిల్ 20, సోమవారం రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌కు రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం పలికారు. ఆయన గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారితో పాటు 'మేడ్ ఇన్ కొరియా' చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది.
37
మేడ్ ఇన్ కొరియా మూవీ బ్యాక్ గ్రౌండ్..
రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్ ఈ 'మేడ్ ఇన్ కొరియా' సినిమాను నిర్మించారు. రా. కార్తీక్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటులు పార్క్ హై-జిన్, నో హో-జిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండు విభిన్న సంస్కృతులను కలిపే అందమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
ఈ విందు గురించి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో స్పందించారు. 'రాష్ట్రపతి భవన్‌లో అద్భుతమైన సాయంత్రం. గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను' అని ఆమె రాసుకొచ్చారు.
57
మా సినిమా బాగుందని మెచ్చుకున్నారు..
'ఇంత గొప్ప వ్యక్తుల మధ్య ఉండటం, వారితో మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. ఇంతటి గౌరవనీయ నాయకులతో కలిసి భోజనం చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉంది. వారు మా 'మేడ్ ఇన్ కొరియా' చిత్రాన్ని కూడా మెచ్చుకున్నారు' అని ప్రియాంక తన పోస్టులో తెలిపారు.
67
ఏదో సాధించాననే భావన ,,
'శశి థరూర్‌ను కలవడం, ఆయనతో మాట్లాడటం అద్భుతంగా అనిపించింది. ఈ రోజు నాలో ఏదో సాధించాననే భావన కలుగుతోంది. ఏళ్ల నాటి కలలు, కష్టం, నమ్మకానికి ప్రతిఫలం దక్కిన క్షణం ఇది. ఇలాంటి క్షణాలే మనం చేసే పనిని గుర్తుచేస్తాయి. ఈ ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చిన 'మేడ్ ఇన్ కొరియా' టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ప్రియాంక పేర్కొన్నారు.
77
ప్రియాంక మోహన్ మూవీ కెరీర్..
ప్రియాంక మోహన్ 'ఒంత్ కథే హెల్లా' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, ఇండస్ట్రీలలో బిజీ నటిగా గుర్తింపు సాధించింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఏడేళ్ళ తరువాత తన మాతృభాష కన్నడాలో ఓ సినిమాలో నటించబోతోంది ప్రియాంక.