పవన్‌ కళ్యాణ్‌తో నటించాల్సి వస్తే `నో` చెప్తా.. తెలుగు యంగ్‌ హీరోయిన్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌..

Published : Jan 17, 2023, 07:34 PM IST

చాలా మంది హీరోయిన్లు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ని కలిసినా చాలనుకుంటారు. అదే నటించాల్సి వస్తే మరో మాట లేకుండా ఎగిరి గంతేస్తారు. కానీ టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ మాత్రం పవన్‌తో నటించే ఛాన్స్ వస్తే నో చెబుతానని అంటోంది.   

PREV
15
పవన్‌ కళ్యాణ్‌తో నటించాల్సి వస్తే `నో` చెప్తా.. తెలుగు యంగ్‌ హీరోయిన్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌..

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడేందుకు తపిస్తుంది ప్రియాంక జువాల్కర్‌(Priyanka Jawalkar). యంగ్‌ హీరోలతో సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ హాట్‌ బ్యూటీ కెరీర్‌ సవాళ్లతో సాగుతుంది. సక్సెస్‌లు లేకపోవడంతో స్ట్రగులింగ్‌లో సాగుతుంది. ఈ క్రమంలో అందాల ఆరబోతలో హాట్‌ టాపిక్‌ అవుతుంది ప్రియాంక. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. 
 

25

ప్రియాంక జవాల్కర్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనతో కలిసి నటించాల్సి వస్తే నో చెబుతానని తెలిపింది. తాను పవన్‌ కళ్యాణ్‌కి పెద్ద అభిమానిని అని చెప్పింది. ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక జవాల్కర్‌ మాట్లాడుతూ, పవన్‌తో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకి స్పందిస్తూ ఒక అభిమానిగా పవన్‌ని దూరం నుంచి చూస్తూ మురిసిపోతానని తెలిపింది ప్రియాంక. 
 

35

ఆయన్ని చూసి సంబరపడతానని, అంతకు మించి ఆయన్నుంచి ఏం కోరుకోనని తెలిపింది. ఆయనతో కలిసి నటించాలనే కోరిక తనకు లేదని చెప్పింది. ఒకవేళ పవన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా తాను చేయను, చేయలేను కూడా` అని తెలిపింది ప్రియాంక జవాల్కర్‌. ఇంకా ఆమె మాట్లాడుత, పవన్‌ కళ్యాణ్‌ అంటే తనకు ఇష్టమని, ఆయన్ని చూస్తూ పెరిగానని చెప్పింది. 
 

45

`తమ్ముడు` చిత్రాన్ని దాదాపు ఇరవై సార్లు చూసినట్టు చెప్పింది ప్రియాంక. ఇక `ఖుషి` సినిమాని ఎన్ని సార్లు చూశానో చెప్పలేనని, ఆ సినిమాలోని ప్రతి డైలాగ్‌ ఈజీగా చెప్పేస్తానని పేర్కొంది. ఎంతో స్టార్‌ డమ్‌ ఉన్న ఆయన ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారో అర్థం కాదని చెప్పింది ప్రియాంక జవాల్కర్‌. 

55

షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ప్రియాంక. ఆమె 2017లో `కలవరం ఆయే` అనే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ  ఇచ్చింది.విజయ్‌ దేవరకొండతో `టాక్సీవాలా` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. రెండేళ్ల క్రితం సత్యదవ్‌తో `తిమ్మరుసు`, కిరణ్‌ అబ్బవరం `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`, గతేడాది `గమనం` చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి పెద్దగా ఛాన్స్ లు లేకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు బాలయ్య, అనిల్‌ రావిపూడి చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories