సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న ప్రియాంక చోప్రా..? కారణమేంటంటే..?

Published : May 12, 2023, 08:22 PM ISTUpdated : May 12, 2023, 08:23 PM IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు జంప్ చేసి.. స్టార్ గా వెలుగుతున్న ప్రియాంకచోప్రా.. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట.. ఇందులోనిజం ఎంతా..? కారణం ఏంటీ..?   

PREV
16
సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న ప్రియాంక చోప్రా..? కారణమేంటంటే..?

బాలీవుడ్ బ్యూటీ.. హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. త్వరలో సినిమాలు మానేయబోతుందా..? మూవీస్ నుంచి తప్పుకుని ఆమె ఏం చేయబోతోంది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందీ విషయం. తమిళ సినిమా ద్వారా తేరంగేట్రం చేసి.. బాలీవుడ్ ను ఊపు ఊపేసి.. హాలీవుడ్ లో పాుకుపోయిన ఈ బ్యూటీ.. అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. 

26

ముఖ్యంగా వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా మారిపోయిన ప్రియాంక.. తాజాగ లవ్ ఎగైన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మే 5న రిలీజ్ అయిన ఈసినిమా ప్రేక్షకులు మన్నను పొందింది. ఇక ప్రస్తుతం హెడ్స్ ఆఫ్ స్టేట్  అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది బ్యూటీ. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇంతలా ఫామ్ చూపిస్తున్న ప్రియాంక చోప్రా.. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. 
 

36

వినడానికి షాకింగ్ గా ఉన్నా.. ఈన్యూస్ లో నిజం ఎంతో తెలియదు కాని.. ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నారట.అన్న వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆమె తన  బిడ్డ కోసం  సినిమాలు మానేయనున్నారని టాక్. ప్రస్తుతం నాలుగు పదుల వయస్సులో కూడా ఏమాత్రం తరగని వన్నెలతో.. హాట్ హాట్ గా దర్శనం ఇస్తోంది బ్యూటీ. మంచి ఫామ్ ను కూడా మెయింటేన్ చేస్తోంది. 

46
Priyanka Chopra

అయితే ఈ వయసులో సినిమాలు చేయటం కంటే.. ఒక్కగానొక్క కూతురు మాలతీ మేరీ చోప్రా జోనస్‌ను చూసుకోవటానికే  ఆమె ఎక్కవగా టైమ్ ను కేటాయించాలని అనుకుంటుందట. తమ బిడ్డతో టైమ్ స్పెండ్ చేయడం.. ఆమె ఎదుగుదల చూడటం.. పెరిగే కొద్ది ఆమెకు కావల్సిన అవసరాలు చూడటం ప్రియాంక చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతుందట. అందుకే త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని టాక్. 
 

56

త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో కూతుర్ని పెంచుకోవటానికి సిద్దమవుతున్నారట ప్రియాంక చోప్రా దంపతులు. ఓ సారి మీడియాతో మాట్లాడుతూ..  కూడా ఆమె అదే హింట్ ఇచ్చింది. నా కూతురి కోసం సినిమాలు మానుకోవాల్సి వస్తే.. నేను రెండో ఆలోచన లేకుండా సినిమాలు మానుకుంటాను. వేరే దేశంలో స్థిరపడతాను అని స్పష్టం చేశారు.

66

బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడే  అమెరికన్‌ పాప్ సింగర్‌,కమ్ యాక్టర్ నిక్‌ జోనాస్‌తో ప్రేమలో పడ్డారు. తన కంటే 10 ఏళ్లు పెద్దవాడైన నిక్ ను  2018లో పెళ్లి చేసుకుుంది ప్రియాంక. ఇరుకుంటంబాల అనుమంతితో వీరు పెళ్ళి చేసుకున్నారు. సరోగసి ద్వారా వీరు ఒక పాపకు తల్లీ తండ్రులుగా మారారు. 

Read more Photos on
click me!

Recommended Stories