ఆలియా భట్ కు అరుదైన అవకాశం, ఇంటర్నేషనల్ బ్రాండ్ కు ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ గా బాలీవుడ్ బ్యూటీ

Published : May 12, 2023, 06:33 PM IST

మన టాలీవుడ్ పుణ్యమా అని  ఇండియన్ స్టార్స్ రేంజ్ మారిపోతోంది. హాలీవుడ్ మేకర్స్ మాత్రమే కాదు.. పులు ఇంటర్నేషనల్ సంస్థలు కూడా మన ఇండియన్ స్టార్స్ కోసం పోటీపడుతున్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కు ఓ అరుదైన అవకాశం వచ్చింది. 

PREV
17
ఆలియా భట్ కు అరుదైన అవకాశం, ఇంటర్నేషనల్ బ్రాండ్ కు ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ గా బాలీవుడ్ బ్యూటీ

ఈమధ్య మన  ఇండియన్ సినిమాలకు.. ఇండియన్ తారలకు విపరీతంగా కలిసివస్తుంది. మనవారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఒక రకంగా టాలీవుడ్ సినిమాల వల్లే.. మన ఇండియన్ సినిమాల ఇమేజ్.. మన సెలబ్రిటీల పేర్లు  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇక అంతర్జాతీయ మీడియాలో మన హీరోలు హీరోయిన్ల హవా భారిగా పెరిగింది. 

27

ఇక బిజినెస్ పరంగా కూడా ఇంటర్నేషనల్ సంస్థలు మనవారికోసం వెంపర్లాడుతున్నాయి. మన హీరోలు, హీరోయిన్ల ఇంటర్వ్యూల కోసం వెతుక్కుంటున్నాయి. మన సెలబ్రిటీలతో తమ బ్రాండ్స్ ని ప్రమోషన్ చేయించాలనుకుంటున్నాయి ఇంటర్నేషనల్ సంస్థలు.

37

రీసెంట్ గా  పలు ఇంటర్నేషనల్ బిజినెస్ బ్రాండ్స్ ఇండియన్ సెలబ్రిటీలతో తమ వస్తువలను  ప్రమోట్ చేయిస్తున్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా లాంటి స్టార్స్ తో పాటు... వెరీ రీసెంట్ గా రష్మిక.. మందన్న కూడా ఈ అవకాశం సాధించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ వంతు వచ్చింది.  తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా చేరింది.

47

తాజాగా బాలీవుడ్ బ్యూటీ  అలియా భట్ ఇంటర్నేషనల్  ప్రముఖ బ్రాండ్ గూచీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కాస్ట్లీ బ్రాండ్ గా గుర్తింపు పొందింది గూచీ. దాదాపు డెవలప్ అయిన  పలు దేశాల్లో దుస్తులు, షూస్, వాచెస్, బ్యాగ్స్, ఆర్నమెంట్స్.. ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఈ బ్రాండ్ నుంచి బిజినెస్ జరుగుతుంది. 

57

గూచీ బ్రాండ్ కి ఇండియాలో కూడా భాగా బిజినెస్ అవుతుంది. మన దేశంలో స్టార్స్ చాలా మంది ఈ కాస్ట్లీ బ్రాండ్ వస్తువలను వాడతారు. దాంతో మన దగ్గర నుంచి కూడా బ్రాండ్ కు ప్రమోషన్ చేయడానికి ఎప్పటి నుంచో సెలబ్రిటీని సెలక్ట్ చేసుకునే పనిలో ఉంది కంపెనీ. ఈక్రమంలోనే తాజాగా గూచీ తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ ని నియమించింది.

67

అలియా భట్ తో పాటు... గూచీ  కూడా స్వయంగా ఈ విషయం తమ సోషల్ మీడియా  ద్వారా తెలిపారు. గూచీకి సంబంధించిన డ్రెస్, బ్యాగ్ ను వేసుకున్న ఆలియా.. ఈ ఫోటోలను తన పేజ్ లో పోస్ట్ చేసింది. అలియా భట్.. నేను ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గూచీకి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. గూచీ నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తుంది, ఆసక్తిని కలిగిస్తుంది. నేను, గూచీ కలిసి మరిన్ని అద్భుతమైనవి సృష్టించాలని అనుకుంటున్నాను అని నోట్ రాసింది ఆలియా భట్. 

77

ఇక గూచీ కంపెనీ కూడా.. తన సోషల్ మీడియాలో.. అలియా భట్ గూచీ హౌస్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్. గూచీ ఉత్పత్తులతో పోజులిస్తుంది అని అలియా భట్ ఫోటోలని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు.. పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories