`వారణాసి` ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రాజమౌళి, మహేష్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్ ఫిల్మ్ `వారణాసి` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. దీంతోపాటు సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు రాజమౌళి. ఇటీవల పలు ఇంగ్లీష్ మీడియా సంస్థలకు గ్రూప్ ఇంటర్వ్యూలిచ్చారు. రాజమౌళి కూడా సెపరేట్‌గా ఇంటర్వ్యూలిచ్చారు.
25
బిజినెస్ చేసే పనిలో వారణాసి టీమ్
నేషనల్ వైడ్‌గా, అంతర్జాతీయంగా సినిమా బిజినెస్ చేయడం కోసం ఈ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాదికిపైగానే ఉంది. అయినా ఇప్పట్నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు రాజమౌళి. సినిమాపై గ్లోబల్ వైడ్‌గా హైప్ పెంచే ప్రయత్నం చేశారు. బిజినెస్‌కి హెల్ప్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పటికే ఓటీటీ డీల్ సెట్ అయ్యిందని, నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.650కోట్లకు ఓటీటీ రైట్స్ తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
35
పెద్దగా ఎగ్జైట్ చేయని టీమ్ ఇంటర్వ్యూలు
ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, అలాగే రాజమౌళి వరుసగా అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చినా, పెద్దగా ఎగ్జైట్ అనిపించలేదు. కొత్తగా వాళ్లేం చెప్పలేదు. వాహ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. సినిమా ఎలా ఉంటుందో చెప్పారు, రామాయణం ఎపిసోడ్ గురించి వెల్లడించారు. ఒకే పార్ట్ గా మూవీ ఉంటుందన్నారు. రాముడి పాత్ర కోసం మహేష్ పడ్డ కష్టాన్ని వెల్లడించారు. ఇవన్నీ మన తెలుగు ఆడియెన్స్ కి కొంత ఎగ్జైటింగ్‌గా అనిపించొచ్చు. కానీ గ్లోబల్ ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కలేదనే టాక్ వినిపించింది.
ఒక్క మాటతో `వారణాసి`పై గ్లోబల్ హైప్ ఇచ్చిన ప్రియాంక చోప్రా భర్త
కానీ ఒకే ఒక్క మాటతో గ్లోబల్ హైప్ ఇచ్చాడు ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రియాంక నటిస్తున్న `వారణాసి` గురించి వెల్లడించారు. ఆయన ఒకే మాట చెప్పారు. అదిప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే, `ప్రియాంక చోప్రా గత 14 నెలలుగా షూటింగ్‌లో పాల్గొంటుంది. `ఆర్‌ఆర్‌ఆర్` దర్శకత్వం వహించిన రాజమౌళి రూపొందిస్తున్న సౌత్ ఇండియా మూవీ ఇది. ఆయన చేస్తున్న భారీ చిత్రం. ఇది అద్భుతంగా ఉండబోతుంది` అని వెల్లడించారు. అంతే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు గ్లోబల్ వైడ్‌గా చక్కర్లు కొడుతున్నాయి. సినిమాపై మంచి హైప్‌ని తీసుకొస్తున్నాయి.
55
పాప్ సింగర్‌గా నిక్ జోనాస్ వరల్డ్ వైడ్‌గా పాపులర్
నిక్ జోనాస్ పాప్ సింగర్. మ్యూజీషియన్, నటుడు. ఆయనకు గ్లోబల్ వైడ్‌గా ఫాలోయింగ్ ఉంది. అనేక దేశాల్లో మ్యూజిక్ ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. దీంతో ఆయన ఫాలోయింగ్ వేరే లెవల్. అలాంటి `వారణాసి` మూవీ గురించి మాట్లాడటంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో అవి సినిమాపై విశేషమైన ప్రచారాన్ని తీసుకొస్తున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ దాదాపు రూ.1300కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.