గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.