సంక్రాంతికి విడుదలైన వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ కంటే అనీల్ రావిపూడి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సక్సెస్ ఎవరినైనా ఏ స్దాయికైనా తీసుకెళ్తుంది. అందరిచేతా శభాష్ అనిపించేలా చేస్తుంది. ఆర్దిక వెసులుబాట్లు అనేకం చేస్తుంది. ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి కు అదే జరుగుతోంది. వెంకటేష్ హీరోగా అనీల్ రావి పూడి తెరకెక్కించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మెగా హిట్ అయ్యింది. మిగతా రెండు సంక్రాంతి సినిమాలను దాటుకుని కలెక్షన్స్ వైజ్ దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా డైరక్టర్ , హీరో ఎంతెంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారనే విషయాలు బయిటకు వచ్చాయి. అందులో అనీల్ రావిపూడి రెమ్యునరేషన్ వెంకటేష్ ని మించిపోవటం అందరినీ షాక్ ఇచ్చింది.
మొదటి నుంచి అనిల్ రావిపూడి సినిమాలంటే ఫన్, ఎంటర్టైన్మెంట్. ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా కూడా అంతే చిన్న పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే సాంగ్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ లు ఏమి లేకుండా సింపుల్ గానే సెట్ చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం క్రైమ్ కామెడీతో నడిపారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కామెడీతో పాటు అంతర్లీనంగా ఓటీటీ పిల్లలపై ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందో, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అంటూ మంచి మెసేజ్ లు కూడా ఎంటర్టైనింగ్ గా చెప్పారు. రియల్ లైఫ్ లో జరిగే చాలా సన్నివేశాలు బాగా రాసుకుని, పర్ఫెక్ట్ డైలాగ్స్ తో ఎంటర్టైన్మెంట్ గా ప్రజెంట్ చేసాడు అనిల్ రావిపూడి. ఏ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో వెళ్తే సినిమాని నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.
రెమ్యునరేషన్ విషయాలకు వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిమిత్తం హీరో వెంకటేష్ కు రెమ్యునరేషన్ గా పది కోట్లు పే చేసారని తెలుస్తోంది. అలాగే డైరక్టర్ అనీల్ రావిపూడికి 15 కోట్లు పే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అడ్వాన్ గా అనీల్ రావిపూడికి 10 కోట్లు ఇచ్చి రిలీజ్ కు ముందు మిగతా ఐదు కోట్లు క్లియర్ చేసారని సినిమా వర్గాల సమాచారం. దాంతో హీరో వెంకటేష్ కన్నా ఐదు కోట్లు ఎక్కువే అనీల్ రావిపూడి తీసుకున్నారంటున్నారు. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మార్కెట్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’మూవీకున్న డిమాండ్ పెరిగిపోవటంతో టీమ్ స్క్రీన్స్ పెంచేసింది. సంక్రాంతి సెలవులు కావడంతో కుటుంబాలతో కలిసి జనాలు థియేటర్‌లకు క్యూ కడుతున్నారు. అన్ని షోలు దాదాపు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించేందుకు చిత్ర టీమ్ సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను వదిలింది టీమ్.