Priyanka Mohan Latest Photos : రెడ్ మిర్చి అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్.. లేటెస్ట్ పిక్స్..

Published : Mar 21, 2022, 11:07 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) రెడ్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోంది.  స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తన లేటేస్ట్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది.

PREV
16
Priyanka Mohan Latest Photos : రెడ్ మిర్చి అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్.. లేటెస్ట్ పిక్స్..

హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైందని చెప్పాలి. నేచురల్  స్టార్ నాని (Nani) నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో తొలిసారి తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది.

26

ఆ మూవీ పెద్ద హిట్ కాకపోయినా.. కొత్త హీరోయిన్ గా ఆడియెన్స్ అటెన్షన్ మాత్రం కొద్దిమేర డ్రా చేసింది. అప్పటికే తెలుగమ్మాయిల కనిపించే ప్రియాంక మోహన్ కు వెంటనే నటుడు శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. శర్వానంద్, ప్రియాంక మోహన్ జోడీ బాగానే ఆకట్టుకుంది.

36

కానీ,  గ్యాంగ్ లీడర్.. శ్రీకారం చిత్రాలు పెద్ద సక్సెస్ ను అందుకోలేకపోయాయి. దీంతో ప్రియాంక కూడా స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేకపోయింది. దీంతో  తెలుగులో రెండు చిత్రాలతోనే సరిపెట్టుకొని తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది.

46

తమిళ స్టార్ హీరో సూర్య (Surya) ఆకాశమే హద్దు రా.. జై భీం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈటీ’ (ET). ఈ చిత్రంలో సూర్య సరసన నటించింది ప్రియాంక మోహన్. సూర్య పాత్రకు సమాన హోదా ఉన్న లేడీ క్యారెక్టర్ లో ప్రియాంక నటించి మెప్పించింది.

56

ఈ చిత్రానికి ఐఎండీబీ IMDb లాంటి ర్యాంకింగ్ సంస్థ కూడా 8.5 రేటింగ్ ఇవ్వడంతో మంచి చిత్రంగా ‘ఈటీ’ పేరు దక్కించుకుంది. దీంతో ప్రియాంక మోహన్ కు  కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు తను నటించిన చిత్రాల్లో ఇదే హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ప్రియాంక చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.

66

అదే జోష్ లో సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు ఫొటోషూట్స్ చేస్తోందీ సుందరి. తాజాగా రెడ్ డ్రెస్ లో మెస్మరైజింగ్ స్టిల్స్ తో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుంది. ‘ఎప్పుడైన సందేహం ఉంటే.. రెడ్ కలర్ దుస్తులు ధరించండి’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

click me!

Recommended Stories