రెయిన్‌బో శారీలో కలర్‌ఫుల్‌ అందాలతో కైపెక్కిస్తున్న ప్రియమణి.. కుర్రాళ్లకి పరీక్ష పెట్టిన హాట్‌ బ్యూటీ

Published : Nov 30, 2022, 04:07 PM ISTUpdated : Nov 30, 2022, 04:08 PM IST

హాట్‌ అందాల భామ ప్రియమణి శారీ కడితే ఇంటర్నెట్‌ దుమ్ము దుమారమైపోవాల్సిందే. ఆమె హాట్‌ అందాలకు నెటిజన్లని చిత్తైపోవాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ ఇంద్రధనస్సులా మెరిసిపోతుంది.   

PREV
16
రెయిన్‌బో శారీలో కలర్‌ఫుల్‌ అందాలతో కైపెక్కిస్తున్న ప్రియమణి.. కుర్రాళ్లకి పరీక్ష పెట్టిన హాట్‌ బ్యూటీ

హీరోయిన్‌గా, జడ్జ్ గా, విలక్షణ నటిగా రాణిస్తున్న ప్రియమణి తాజాగా శారీలో కనువిందు చేసింది. ఒకే ఒక్క ఫోటోతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఇంద్రధనస్సుని తలపించే కలర్‌ ఫుల్‌ శారీ కట్టి కత్తిలాంటి పోజు ఇచ్చింది ప్రియమణి. ఓరగా పక్కకు చూస్తూ ఆమె ఇచ్చిన పోజు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది.
 

26

కలర్‌ ఫుల్‌ అందాలతో కవ్విస్తున్న ప్రియమణి నెటిజన్లకి ఓ పరీక్ష పెట్టింది. తన పిచ్చెక్కించే పోజుకి క్యాప్షన్‌ పెట్టండి అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పిక్‌ వైరల్‌ అవుతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. అభిమానులు షేర్‌ చేస్తుండటంతో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది.
 

36
Priyamani

అయితే ఇందులో ప్రియమణి అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రెయిన్‌ బో అందాలు అదరహో అని, ప్రియమణి కలర్‌ ఫుల్‌ అందాలు చూడతరమా అని, చీరలో పిల్లుమణి ఫైరింగ్‌ అని కామెంట్లు పెడుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రియమణి అందాలకు గోలెత్తిపోతున్నారు. 
 

46

ప్రియమణి ఇప్పుడు సీనియర్‌ హీరోలకు జోడీగా చేస్తూ రాణిస్తుంది. అదే సమయంలో కీలక పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుందీ హాట్‌ బ్యూటీ. పాత్ర బలంగా ఉంటే అది ఎలాంటి పాత్రైనా చేసేందుకు సిద్ధంగానే ఉంటుంది. తనలోని నటిని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. 

56
Priyamani

ప్రియమణి ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న `కస్టడీ` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతోపాటు హిందీలో `మైదాన్‌`లో అజయ్‌ దేవగన్‌కి జోడీగా చేస్తుంది. దీంతోపాటు షారూఖ్‌ ఖాన్‌, నయనతార నటిస్తున్న `జవాన్‌`లోనూ కీరోల్‌ చేస్తుంది. అలాగే కన్నడలో `డాక్టర్‌ 56`, `ఖైమా`, తమిళంలో `క్వోటేషన్‌ గ్యాంగ్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

66

ఇదిలా ఉంటే గత సీజన్‌ వరకు `ఢీ` షోకి జడ్జ్ గా చేసిన విషయం తెలిసిందే. `ఢీ14`కి కూడా కొన్నాళ్లపాటు జడ్జ్ గా చేసింది. ఆమె తప్పుకుంది. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్‌ పెట్టింది. ఓ వైపు సినిమాలు, ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ బిజీగా ఉంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories