పిచ్చెక్కిస్తున్న ప్రియమణి విరహా పోజులు.. కసిగా కవ్విస్తూ థైస్‌ అందాలతో మంటలు రేపుతున్న `ఢీ` భామ

Published : Jun 01, 2022, 05:55 PM ISTUpdated : Jun 01, 2022, 07:37 PM IST

`ఢీ` బ్యూటీ ప్రియమణి అందాల ఆరబోతలో తగ్గేదేలే అనిపిస్తుంది. `ఢీ` షో కోసం ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. ప్రతి బుధవారం ఫ్యాన్స్ కి అందాల విందు వడ్డిస్తుంది. 

PREV
18
పిచ్చెక్కిస్తున్న ప్రియమణి విరహా పోజులు.. కసిగా కవ్విస్తూ థైస్‌ అందాలతో  మంటలు రేపుతున్న `ఢీ` భామ
Priyamani Glamoure pics

`ఢీ`షోకి జడ్జ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రియమణి(Priyamani) కొత్త ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. పర్పుల్ కలర్‌ ట్రెండీ వేర్‌లో తాజాగా రెచ్చిపోయింది ప్రియమణి. కసిగా చూస్తూ కవ్విస్తుంది. కుర్రాళ్ల హృదయాలను బ్రేక్‌ చేస్తుంది. ఎప్పుడూ లేనంత ఘాటుగా పోజులిచ్చి మతిపోగొడుతుంది ప్రియమణి.

28
Priyamani Glamoure pics

ప్రియమణి హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పుడు విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటుంది. సీనియర్‌ హీరోలకు జోడీగా చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే హీరోయిన్‌ గా ఎన్ని సినిమాలు చేసినా రాణి క్రేజ్‌, ఫాలోయింగ్‌కి ఇప్పుడు `ఢీ` షోతో ఆమెకి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. 
 

38
Priyamani Glamoure pics

జనరల్‌గా ఇటీవల టీవీ షోస్‌కి ఆదరణ పెరిగింది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత చాలా మంది టీవీ షోస్‌ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచే షోలకు మంచి డిమాండ్‌ ఉంది. అందులో భాగంగానే `ఢీ` డాన్స్ షోకి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ షోకి ప్రియమణి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. టీవీ ఆడియెన్స్ కి దగ్గరైంది ప్రియమణి. 

48
Priyamani Glamoure pics

ఈ ఢీ షోలో ప్రియమణి, హైపర్‌ ఆదిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రియమణిపై ఆది వేసే పంచ్‌లు, ఆదిపై ప్రియమణి పంచ్‌లు, మధ్యలో డాన్సులు, అలాగే హగ్గులు ఆద్యంతం హైలైట్‌గా నిలుస్తుంటాయి. షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డాన్సు పర్‌ఫెర్మెన్స్ ల మధ్య వీరి సరదా కామెడీ రిలీఫ్‌నిస్తుంది. 

58
Priyamani Glamoure pics

మరోవైపు ఈ షోతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉంది ప్రియమణి. సినిమాలు, వెబ్‌ మూవీ, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. ఆ మధ్య `భామ కలాపం` అనే ఓ వెబ్‌ మూవీ చేసింది. వంటకాలు, ఇంట్లో ఇల్లాలు స్ట్రగుల్స్ ప్రధానంగా సాగే చిత్రమిది. మంచి ప్రశంసలందుకుంది. 

68
Priyamani Glamoure pics

మరోవైపు వెంకటేష్‌తో మొదటిసారి `నారప్ప` చిత్రంలో కలిసి నటించింది. డీ గ్లామర్‌ లుక్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం ప్రియమణి `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో కామ్రేడ్‌ భరతక్క పాత్రలో ప్రియమణి కనిపించనుంది. నక్సలైట్‌ పాత్రని ఆమె పోషిస్తుంది. ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతుంది. 

78
Priyamani Glamoure pics

వీటితోపాటు ప్రియమణి కన్నడలో మూడు సినిమాలు, హిందీలో రెండు చిత్రాలు, తమిళంలో ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌తో కలిసి `మైదాన్‌`లో నటిస్తుంది. ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.

88
Priyamani Glamoure pics

ప్రియమణి మారుతున్న కాలానికి అనుగుణంగా తను కూడా మారుతుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్‌, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. తమలోని నటికి ఎప్పుడూ పని చెబుతుంది. సవాళ్లని స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది. అదే సమయంలో గ్లామర్‌ ఫోటోలతో అందాల విందు వడ్డిస్తూ, ఆమె అభిమానులను ఖుషీ చేస్తుంది. యంగ్‌ హీరోయిన్లకి పోటీనిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories