ముద్దు సీన్లు నటించకపోవడానికి కారణం అదే.. అసలు సీక్రెట్‌ బయటపెట్టిన ప్రియమణి..

Published : Jun 30, 2023, 04:04 PM IST

ప్రియమణి.. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. పెళ్లి తర్వాత హీరోయిన్‌ పాత్రలు కాకుండా కీలక పాత్రలకు సై అంటోంది. ఇటీవల నటిగా బిజీ అయిన ఈ బ్యూటీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 

PREV
15
ముద్దు సీన్లు నటించకపోవడానికి కారణం అదే.. అసలు సీక్రెట్‌ బయటపెట్టిన ప్రియమణి..
Priyamani

ప్రియమణి.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె భారీ చిత్రాల్లో భాగమవుతుంది. ఇటీవల నాగచైతన్య `కస్టడీ`లో సీఎంగా మెరిసింది. త్వరలో `జవాన్‌` చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. ఇందులో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. కిస్‌ సీన్లలో నటించకపోవడానికి కారణం ఏంటో చెప్పింది.  చాలా కాలంగా ముద్దు సీన్లకి దూరంగా ఉంటోంది. ఆ కిస్‌ సీన్లలో నటించకపోవడానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. 
 

25

ప్రియమణి ఇందులో మాట్లాడుతూ, మ్యారేజ్‌ అయ్యాక ముద్దు సీన్లకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. సినిమాల్లో కేవలం పాత్రనే అయినా వెండితెరపై చూసినప్పుడు ఆయా సీన్లకి తాను ఇబ్బంది పడతానని తెలిపింది ప్రియమణి. తాను ముద్దు సీన్లలో నటిస్తే అందుకు తన భర్తకి సమాధానం చెప్పాల్సి వస్తుంది, అది మంచి వాతావరణం కాదని భావించి తాను ముద్దు సీన్లకి దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. 
 

35

2017లో ప్రియమణి మ్యారేజ్‌ అయ్యింది. అప్పట్నుంచి తాను కిస్‌ సీన్స్ కి గుడ్‌ బై చెప్పినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు అలాంటి సీన్లలో నటించలేదని పేర్కొంది. ఒక సినిమాకి సైన్‌ చేయడానికి ముందే ఇలాంటి కండీషన్స్ చెబుతానని, తాను ఏ సినిమాలో నటించినా తన ఇరుకుటుంబాలు సినిమాని చూస్తాయని, వాళ్లు అలాంటి సన్నివేశాల వల్ల ఇబ్బంది పడటం తనకు ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది ప్రియమణి. 
 

45
Priyamani

మరోవైపు ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ట్రోల్స్ గురించి రియాక్ట్ అయ్యింది. వాటిని అస్సలు పట్టించుకోనని, పరిగణలోకి కూడా తీసుకోనని తెలిపింది. తాను పెళ్లైన కొత్తలో తనపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయని, ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నించారని తెలిపింది. అంతేకాడు బాడీ షేమింగ్‌ కామెంట్లు చేశారు. తమది లవ్‌ జీహాద్‌ అని, మీ పిల్లలు జీహాదీయులుగా పుడతారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారని తెలిపింది. 

55

ఈ సందర్భంగా అలాంటి కామెంట్లు చేసే వారికి తాను చెప్పేది ఒక్కటే అంటూ, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు ప్రియమణి. కొంచెం బుద్దితో ఆలోచించాలని మండిపడింది. ప్రస్తుతం తన భర్తతో సంతోషంగా ఉన్నామని తెలిపింది. విడాకుల రూమర్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజాని పెళ్లి చేసుకుంది ప్రియమణి. వీరిది ప్రేమ పెళ్లి. బెంగుళూరులో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories